YS Jagan: వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు, ప్రభుత్వం నడుస్తున్న తీరుపై విమర్శలు చేశారు. ప్రజాసమస్యపై గళమెత్తాలని సభ్యులకు సూచించారు.

Continues below advertisement

శాసనసభలో 40 శాతం ఓట్లు పొందిన పార్టీగా వైఎస్‌ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోయినా, ప్రభుత్వం ప్రస్తావించే ప్రతి అంశానికి ఆధారాలతో ప్రెస్‌మీట్‌లు ద్వారా ప్రజలు వివరిద్దామని అన్నారు. 

డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ 

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ విమర్శలు చేస్తోంది. మెరిట్ లిస్ట్‌లో జరిగిన మార్పులు, అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి, పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేలా కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండే చేశారు. 

Continues below advertisement

ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు నిలిపివేయడంపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 9100 కోట్లు. వసతి దీవెన కింద మరో 3300 కోట్లు వెరసి 12400 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆయన లెక్కలు వివరించారు. ప్రభుత్వం కేవలం  2900 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన నిధుల కోసం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. 

Also Read: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!

రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర లేమి, పెట్టుబడి నష్టాలు, ఉచిత పంటల బీమా రద్దు వంటి అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేయాలని జగన్ చెప్పారు. నీటి విడుదల విషయంలో రైతులను మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అదే విధంగా,కొత్తగా ప్రవేశ పెట్టిన పీపీపీ పాలసీని ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వమే నిధులు ఇస్తూ, వడ్డీలు కడుతూ, రాయితీలు ఇస్తూ, చివరకు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు పేరుతో వసూలు చేసుకోవడానికి ప్రైవేటు సంస్థలకు అనుమతించడం పెద్ద స్కామ్ అని ఆయన అన్నారు. 

కేసులపై న్యాయపోరాటం

రాష్ట్రంలో విపక్ష నేతలను అణచివేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీసీ నాయకులైన చింతాడ రవి, ముస్తాఫా, విరూపాక్షి, కారుమూరు సునీల్‌ వంటి వారిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అరెస్టు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనలకు అవకాశం లేకుండా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని దీనిపై కచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తామని వెల్లడించారు. 

శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావు

అసెంబ్లీకి దూరంగా ఉన్నా, మండలిలో తమకు ఉన్న బలాన్ని వాడుకుని ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని  వైసీపీ నిర్ణయించింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన పదవికి తూమాటి మాధవరావును వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా జగన్ ప్రతిపాదించారు. సభ్యులంతా సమన్వయంతో పని చేసి పూర్తి కసరత్తుతో సాక్ష్యాధారాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 

Also Read: Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు