YS Jagan Nellore visit postponed: జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంఘిభావం తెలియచేయడానికి మూడో తేదీన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే హెలిప్యాడ్ కు అనుమతి రానందున పర్యటనను వాయిదా వేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   జగన్ హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడు వద్దకు రావాలని షెడ్యూల్ చేశారు.  హెలిప్యాడ్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులపై అధికారుల నుండి స్పష్టత లేకపోవడం వల్ల పర్యటన వాయిదా పడింది. వైఎస్ఆర్‌సీపీ నేతలు జూన్ 27, 2025న ఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ, అధికారులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.  హెలిప్యాడ్ స్థలం యజమానిపై పోలీసులు ఒత్తిడి  చేసి బెదిరింపులు జరిగినట్లు వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. 

నెల్లూరు పోలీసు అధికారులు జగన్ పర్యటనకు కేవలం 100 మంది మాత్రమే హాజరు కావాలని. మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇస్తామని ఆంక్షలు విధించారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ సత్తెనపల్లి లోని రెంటపాళ్లకు ర్యాలీగా వెళ్లడంతో ముగ్గురు చనిపోయారు. దీంతో పోలీసుల అనుమతి, హెలిప్యాడ్ కోసం సమయం తీసుకోవాలని నిర్ణియంచారు. జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని  నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ ఆరోపించారు. ఉ 

 వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి  జగన్   నెల్లూరు పర్యటనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.  కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనిం సహా పలు కేసులలో రిమండ్ లో ఉన్నారు. పర్యటన వాయిదా పడినందున, వైఎస్ఆర్‌సీపీ నేతలు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

మాజీ మంత్రి మరియు వైఎస్ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి 2025 మే 25 నుండి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయంలో అరెస్టు చేసి, మే 26, 2025న నెల్లూరుకు తీసుకొచ్చారు. అప్పటి నుండి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, వరదాపురం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై అనుమతులు లేకుండా క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి, రవాణా చేసిన కేసులో కాకాణి నాల్గో నిందితుడిగా  ఉన్నారు. ఈ కేసులో కాకాణి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ,సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 

కృష్ణపట్నం పోర్టు సమీపంలో 2022లో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ముత్తుకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నెల్లూరు రైల్వే కోర్టు ఈ కేసులో కాకాణికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది . సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన కేసులో కాకాణి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.   ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి జూన్ 27, 2025న బెయిల్ మంజూరైంది.  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కూడా కేసు నమోదు అయింది.  ఈ కేసులో నెల్లూరు నాల్గవ అదనపు కోర్టు కాకాణికి జూన్ 27, 2025న బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, ఇతర కేసుల కారణంగా ఆయన జైలులోనే ఉన్నారు.

కేసులు నమోదు అయిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి  మార్చి నుంచి మే వరకూ పరారీలో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో పోలీసులు గాలింపు చేపట్టిన తర్వాత, చివరకు కేరళలో అరెస్టు చేశారు.