YCP trolls Srikalahasti Janasena: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కోట వినుత వ్యక్తిగత పీఏ శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు ప్లాన్ చేసి, చంపేసింది కోట వినుత దంపతులేనని గుర్తించి అరెస్టు చేశారు. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ అధినాయకత్వం వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై వైఎస్ఆర్ పార్టీ , జనసేన మధ్య సోషల్ మీడియా వార్ ప్రారంభమయింది. మైక్ ముందు దాడులు, హత్యల గురించి తెగ శుద్ధపూస కబుర్లు చెప్తావు.. ఇప్పుడు మీ పార్టీ శ్రీకాళహస్తి ఇంఛార్జ్ చేసిందేంటి అని పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో వైసీపీ ప్రశ్నించింది.
అయితే జనసేన , టీడీపీనేతలు మాత్రం.. అనంతబాబు కేసును తెరపైకి తెస్తున్నారు. అసలు అనంతబాబు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసి.. స్వయంగా అంగీరించినా ఆయనను జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని గుర్తు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు..తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి.. మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి వెళ్లాడు. పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయకపోడం, చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. సొంత బాబాయ్ YS వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి, విచారణకు పంపించకుండా, బెయిల్ ఇప్పించి, MP సీట్ ఇచ్చిన చరిత్ర మీదని జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చారు. హత్య కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసిన నిబద్ధత జనసేన పార్టీ దన్నారు. ... నీకు ఏ మాత్రం విజ్ఞత ఉన్నా ముందస్తు బెయిల్ మీద బయట ఉన్న అవినాష్ రెడ్డిని విచారణకు పంపించు, నీపై ఉన్న అవినీతి కేసుల్లో విచారణకు సహకరించు, కోడికత్తి డ్రామా కేసులో సాక్ష్యం చెప్పు, దళిత డ్రైవర్ ను హత్య చేసిన MLC అనంత బాబును వెంటేసుకుని తిరగడం మానేయ్యాలని జనసేన పార్టీ సవాల్ చేసింది.
రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.. తమ నేతల నేరచరిత్రను బయటకు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు.