Yanamala Political Career | తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న యనమల రామకృష్ణుడి శకం ముగిసిందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇటీవల ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో మరొకసారి కొనసాగింపు ఉంటుందని ఆయన అనునీయులు భావించారు. కానీ చంద్రబాబు ఆయన పేరుని పరిగణలోకి తీసుకోలేదు. టిడిపికి దక్కిన మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినా వారిలో యనమల పేరు మాత్రం లేదు. బీటీ నాయుడు బీద రవిచంద్ర లను రెండు ఎమ్మెల్సి స్థానాలకు ఎంపిక చేశారు చంద్రబాబు. దానితో 1982 నుండి ఇప్పటివరకూ ఏదో ఒక పదవి లో కొనసాగుతూ వస్తున్న యనమల రామకృష్ణుడు ఇలా ఏ పదవి లేకుండా ఉండడం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చంద్రబాబు కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా యనమలకు పేరు
చంద్రబాబుతో సహా టిడిపిలో అత్యంత సీనియర్ నేతలుగా కొనసాగుతున్న నేతల్లో రామకృష్ణుడు ఒకరు. అశోక్ గజపతి రాజు, రామకృష్ణుడు, కళా వెంకట్రావు, షరీఫ్, సోమిరెడ్డి లాంటి ఇప్పటికీ పార్టీ లో కొనసాగుతున్న అతి కొద్ది మంది పాతకాలం లీడర్ల లో యనమల ఒకరు. మంత్రిగా, స్పీకర్ గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలకపదవులు నిర్వహించారు. 73 ఏళ్ల వయస్సు లోనూ యాక్టివ్ గానే ఉంటున్నారు. అయితే పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములాను టిడిపి ఈమధ్య ఆచరణ లో పెడుతోంది. దాని కారణంగా యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు అనే ప్రచారం పార్టీలోనే అంతర్గతంగా సాగుతోంది. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తుని శాసనసభ్యురాలి గా ఉన్నారు. 1983 నుండి 2004 వరకూ 6 సార్లు ఎమ్మెల్యే గా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009 లో తొలిసారి ఓటమి చెందినా ఆయనకు కీలక పదవులు ఇచ్చి టీడీపీ గౌరవించింది. ఈసారి మాత్రం ఎమ్మెల్సీ స్థానంలో ఆయనను కొనసాగించకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరీర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది
యనమల ఆ రెండు పొరపాట్లు చేశారా?
పొలిటికల్ గా ఎప్పుడు గుంభనంగా ఉండే యనమల రామకృష్ణుడు ఇటీవల రెండు విషయాల్లో మాత్రం పార్టీ పై తన అసంతృప్తి ని బాహటంగానే ప్రకటించారు. ఒకటి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బీసీ కోటాలో ఆయన ఆ పదవి ఆశించారు. దక్కకపోయేసరికి కొంత అసంతృప్తికి లోనయ్యి అధ్యక్షుడికి లేఖ రాశారు. రెండోది కాకినాడ సెజ్ విషయంలో ఈ విధానం పైన తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇవి నిజానికి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు. ఈ రెండు సంఘటనలు పార్టీలోని యువ నాయకత్వానికి యనమలకు మధ్య గ్యాప్ ని తెచ్చేయనేది అంతర్గత వర్గాల సమాచారం
యనమలకు తగిన పదవి
మరోవైపు యనమల పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని హై కమాండ్ ఏదో ఒక కీలకపదవి అప్పజెబుతోందని లేదా 2027 లో ఖాళీ అయ్యే 23ఎమ్మెల్సి స్థానాల్లో అయినా ఆయనకు చోటు కల్పిస్తారని యనమల అభిమానులు ఆశవహంతో ఉన్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.