World Cup 2023 Final: వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బ్లూ జెర్సీ వర్సెస్ ఎల్లో జెర్సీ మ్యాచ్ వార్ ముగిసింది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన వరల్డ్ కప్ ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అయితే ఏపీలోనూ బ్లూ జెర్సీ వర్సెస్ ఎల్లో జెర్సీ (Blue Vs Yellow) వార్ జరిగింది. ఈరోజు ప్రపంచ కప్ ఫైనల్ తో పాటు ఏపీ ఎన్నికల్లోనూ విజయం సాధించేంది బ్లూ జెర్సీ (YSRCP)దే అని ఆ పార్టీ వాళ్లు ఫొటోలతో కామెంట్లు చేసి హల్ చల్ చేశారు. 


బ్లూ వర్సెస్ ఎల్లో జెర్సీ..
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల జెర్సీల ఫొటోలను వైసీపీ కార్యకర్తలు, జగన్ మద్దతుదారులు పోస్ట్ చేశారు. చంద్రబాబు, జగన్ ఫొటోలతో పార్టీ జెండాలను పోస్ట్ చేస్తూ అసలుసిసలైన సమరం ఇది అని ట్రెండ్ చేశారు. ఫైనల్లో బ్లూ జెర్సీ ఎలాగైతే నెగ్గుతుందో, ఏపీలో ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. టీమిండియాకు విజయం తథ్యమని, ఏపీలో బ్లూ జెర్సీ (వైసీపీ)కి తిరుగులేదని వైసీపీ గేమ్ మొదలుపెట్టింది. 






టీడీపీ తెలుగు తమ్ముళ్లు సైతం ట్విట్టర్ లో ఎదురుదాడి మొదలుపెట్టారు. 2003లో ఆస్ట్రేలియా (ఎల్లో జెర్సీ) విజయం సాధించింది. మరుసటి ఏడాది 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైందని ట్వీట్ చేశారు. ఇప్పుడు 2023లో బ్లూ జెర్సీ (ఇండియా) కప్ కొడుతుందని, అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ఖాయమని తెలుగుతమ్ముళ్లు వైసీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. ఇదే ఛాన్స్ అని వైసీపీ రిటర్న్ కౌంటర్ ఇచ్చిపడేసింది. టీడీపీ లాజిక్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందని జగన్ మద్దతుదారులు, వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.






సీఎం సీటు మాదే, మేం అధికారంలోకి వస్తాం కానీ.. దేశానికి సంబంధించిన మ్యాచ్ లకు మీ పార్టీకి పోలిక ఏంటి, సిగ్గుందా అంటూ టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. 2024లో చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని ఇందులో డౌట్ వద్దని తెలుగుతమ్ముళ్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో వైసీపీ మద్దతుదారులు జై జగన్, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు అని జెండా ప్రదర్శించారు. దీనిపై సైతం వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మద్ద సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ జరిగింది.


Also Read: చంద్రబాబుకు భారీ ఊరట - స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్