Weather Latest News: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరుగా  వెల్లడించాయి.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. తూర్పు పడమర ద్రోణి ఇప్పుడు పంజాబ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ ఒడిశా తీరం నుంచి హరియాణా, దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం మధ్య తీర ప్రాంత ఒడిశా, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఉత్తర భారత దేశద్వీపకల్పం 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలుల సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగి ఈ రోజు బలహీన పడింది.






ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


రాయలసీమలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


Telangana Weather: తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి సహా అన్ని జిల్లాల్లో నేడు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌ వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు గాలి వేగం గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీలు, 22.5 డిగ్రీలుగా ఉంది.