Visakha Crime News: విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా- చినగదిలి తహసీల్దార్ దారుణ హత్య

Vizag Crime News: వైజాగ్‌లో తహసీల్దార్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.తన అపార్టమెంట్‌ వద్దే దాడికి పాల్పడ్డారు.

Continues below advertisement

Land Mafia In Vizag: విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ప్రశాంతంగా ఉండే విశాఖలో అధికారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. చిన్నగదిలి రూరల్‌ తహసీల్దార్‌ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. కొమ్మాది తన నివాసంలో ఉంటున్న టైంలో దుండగులు ఎటాక్ చేశారు. చరణ్‌ క్యాస్టిల్ అపార్ట్‌మెంట్‌లో గేట్ ముందే ఆయనపై దాడి చేశారు. ఇనప రాడ్‌లతో తలపై గట్టిగా కొట్టారు. తీవ్ర గాయాలు పాలైన రమణయ్య కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న వాచ్ మెన్ అలర్ట్ అయ్యాడు. ఆయన పరుగెత్తుకొని వచ్చి చుట్టు పక్కల వారిని పిలవడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. 

Continues below advertisement

తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న తహసీల్దార్‌ రమణయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. దీని వెనుక లాండ్ మాఫియా ఉందని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. 

Continues below advertisement