అన్వేషించండి

US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి

అక్కడ పరిస్థితులు క్షీణించాయని, తనకు అక్కడ ఉండాలని లేదని, ఇంటికి తిరిగొచ్చేయాలని ఉందని ఒమన్ తీరంలో అమెరికా దాడిలో చనిపోయిన చీఫ్ ఇంజనీర్ సురేష్ చెప్పారని ఆయన భార్య భార్గవి తెలిపారు.

విశాఖపట్నం: ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కూడా ఉన్నారు. ఈ దాడిపై సురేష్ భార్య భార్గవి పీటీఐతో మాట్లాడారు. భర్త జూన్ 9న తనతో ఫోన్లో మాట్లాడారని, అక్కడ పరిస్థితులు ఏం బాగోలేవని, త్వరలోనే ఇంటికి వచ్చేయాలని ఉందని చెప్పారని తెలిపారు. జూన్ 10న అమెరికా చేసిన దాడిలో ఆయన చనిపోయారు. గత 5 నెలలుగా సముద్రంలోనే విధుల్లో ఉన్న సురేష్, త్వరలోనే ఇంటికి రావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సురేష్ స్వస్థలమైన విశాఖపట్నంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సురేష్ విధులను ముగించుకుని ఇంటికి తిరిగి రావడం కోసం అప్పటికే రిలీవింగ్ లెటర్ (ఉద్యోగ విధులనుండి విడుదలకు సంబంధించిన పత్రం) కూడా లభించిందని భార్య భార్గవి తెలిపారు. తాను బాగా అలసిపోయానని, ప్రస్తుతం పరిస్థితులు కూడా బాగోలేవని తన భర్త రిక్వెస్ట్ చేసుకున్నారని తెలిపారు. తన స్థానంలో వచ్చే మరో సిబ్బందికి బాధ్యతలు అప్పగించి, నౌక దిగి కుటుంబంతో కలవడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తరువాత రెస్క్యూ టీమ్ వారిని కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, మరికొందరు సిబ్బంది సైతం డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

నలుగురం ఇప్పుడు ముగ్గురం అయ్యాం.. 
జూన్ 24న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సురేష్ ఎంతో ఆశగా ఎదురుచూశారని ఆయన భార్య భార్గవి కన్నీరుమున్నీరయ్యారు. "మేము నలుగురం ఉండేవాళ్లం, ఇప్పుడు ముగ్గురమే మిగిలాం" అంటూ భార్గవి తన ఆవేదనను పంచుకున్నారు. ఆ కంపెనీకి వర్క్ చేస్తుండగా ఆన్ డ్యూటీలో ప్రమాదం జరిగింది. నా, మా పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తారని అడిగినట్లు తెలిపారు. కంపెనీని నమ్ముకుని ప్యాషన్‌తో నా భర్త ఉన్నారు. ఆయనను నమ్ముకుని మేం ముగ్గురు ఇక్కడ ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడిలో చనిపోయిన చీఫ్ ఇంజనీర్ సురేష్‌కు భార్య భార్గవితోపాటు 13, 10 ఏళ్ల వయసున్న కుమారులు ఉన్నారు.

Also Read: Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!

లిస్టులో తొలిపేరు నా భర్తదే..

‘నిన్న రాత్రి వారు నాకు ఫోన్ చేశారు. మెసేజ్ కూడా చేశారు. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. మీ భర్త పనిచేస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ముగ్గురు భారత సిబ్బంది గల్లంతయ్యారు. వారు తెలిపిన మొదటి పేరు నా భర్తదే, ఆ తర్వాత మిగిలిన ఇద్దరు సిబ్బంది పేర్లు చెప్పారు. ఆ తర్వాత, నేను వారితో ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. నేను సూపరింటెండెంట్ కాంటాక్ట్ వివరాలను అడగ్గా, వారు నాకు దుబాయ్ ఆఫీస్ నెంబర్ ఇచ్చారు. నేను వారిని కాంటాక్ట్ అయినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వారు చెప్పారు. 21 మంది సిబ్బందిని రక్షించామని, ముగ్గురు గల్లంతయ్యారని నాకు తెలిపారు. 

ఆన్‌లైన్‌లో చాలాసేపు సెర్చ్ చేశాక, మిగిలిన ఇద్దరు సిబ్బంది మృతదేహాలు అప్పటికే లభ్యమయ్యాయని, వారిని గుర్తించారని కనిపించింది. మిగిలిన 21 మంది సిబ్బందిని రక్షించారు. కేవలం చీఫ్ ఇంజనీర్ అయిన నా భర్త ఆచూకీ మాత్రమే తెలియలేదు. రాత్రి కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ సాధ్యం కాకపోవచ్చని నేను భావించాను. మరుసటిరోజు ఉదయం నుండి ఫాలో అప్ చేశాం. వారికి కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ స్పందించారు. కొన్ని ప్రయత్నాల తర్వాత నా కాల్స్ ఎత్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన మృతదేహం లభ్యమైందని వారు ధృవీకరించారని’ పీటీఐకి తెలిపారు.

Frequently Asked Questions

ఒమన్ తీరంలో జరిగిన ప్రమాదం ఏమిటి?

ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైనిక దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఒకరు విశాఖపట్నం వాసి.

ఈ దాడిలో మరణించిన ఆంధ్రప్రదేశ్ వాసి ఎవరు?

విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ ఈ దాడిలో మృతి చెందారు. ఆయన గత 5 నెలలుగా సముద్రంలో విధుల్లో ఉన్నారు.

దాడి జరగడానికి ముందు సురేష్ పరిస్థితి ఏమిటి?

సురేష్ విధులను ముగించుకుని ఇంటికి తిరిగి రావడానికి రిలీవింగ్ లెటర్ పొందారు. ఆయన త్వరలోనే నౌక దిగి కుటుంబంతో కలవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.

సురేష్ మరణంపై ఆయన భార్య భార్గవి ఆవేదన ఏమిటి?

భార్గవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 24న తమ 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాలని సురేష్ ఆశగా ఉన్నారని తెలిపారు. 'నలుగురం ఇప్పుడు ముగ్గురం అయ్యాం' అని కన్నీరుమున్నీరయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget