Vizag Latest News: స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా విశాఖ మన్యం (అనకాపల్లి జిల్లా) లోని వి.మాడుగుల మండలం ఆరువాడ పంచాయతీ కొండవీటి గ్రామంలో గిరిజనులకు ఇంకా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఊరికి రోడ్డు కోసం ఈరోజు (శనివారం) అడ్డాకుల టోపీలు పెట్టుకొని అర్థనగ్నం గా నిరసన తెలియజేసారు. ఊరి పెద్దలు బురద నీటిలో దిగి నిరసన తెలియజేస్తూ రోడ్డు కోసం డిమాండ్ చేసారు. తమ బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయంటూ కనీసం తమ పిల్లల బతుకులు అయినా మారాలంటూ గిరిజనులు ఈ నిరసన తెలియ జేశారు

పిల్లలు చదవు కోవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి ఉందనీ వర్షం పడి వాగు ఎక్కువైతే వారమైనా రెండు వారలైనా నీరు తగ్గేంత వరకూ బడికి సెలవు పెట్టాల్సిందే అని గ్రామస్తులు తెలియజేశారు. అదే గర్భిణీ స్త్రీలుకు అయితే డోలీ మోతలు తప్పడం లేదనీ  వర్షం పడినట్లయితే సంతకు వెళ్లాలన్నా పడుతూ లేస్తూ వెళ్లి సరకులు తెచ్చుకునే పరిస్థితి ఉందని వారు వాపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం రావడంలేదని స్థానిక  గిరిజనులు ఈ నిరసన తెలియజేసారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డోలీ లేని గ్రామాలుగా గిరిజన ప్రాంతాలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారనీ దానిని త్వరగా ఆచరణలో పెట్టాలని గిరిజనులు అంటున్నారు స్థానికంగా అధికారంలో ఉన్న సర్పంచులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ప్రభుత్వ అధికారులకు గానీ మొరపెట్టినప్పటికీ ఎవరూ తమ సమస్య పట్టించు చేసుకోవడం లేదని వారు అంటున్నారు..  రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చి నప్పుడు ఓట్లు వేయించు కుని వాడుకోవడం తప్ప ఇక్కడ గిరిజనులకి న్యాయం జరగటం లేదని కొండవీటి గ్రామ ప్రజలు కోరుతున్నారు.