Google Cloud India to Unveil India First AI CoE in Vizag:  పబ్లిక్ గవర్నెన్స్ , సిటిజన్-సెంట్రిక్ ఇన్నోవేషన్ కోసం రియల్-వరల్డ్ AI సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్న సోషల్ ఎంటర్‌ప్రైజ్ టెక్‌భారత్ రీసెర్చ్ ఫౌండేషన్, గూగుల్ క్లౌడ్ ఇండియా చేతులు కలిపాయి. భారతదేశంలో మొట్టమొదటి AI సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (CoE)ను  ప్రజా ప్రయోజనాల కోసం ప్రారంభిస్తున్నాయి.   విశాఖపట్నంలో ఈ CoE పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా AIని సమానత్వం, సామర్థ్యం, ఎంపవర్‌మెంట్ కోసం ఉపయోగించి, ప్రభుత్వాలు, సంస్థలతో కలిసి పబ్లిక్ సర్వీసెస్‌ను  మెరుగుపరచాలనే లక్,్యం పెట్టుకున్నారు.                            

Continues below advertisement

టెక్‌భారత్ రీసెర్చ్ ఫౌండేషన్, హైదరాబాద్‌లోని పారడైమ్ IT (డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్  ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీ సొల్యూషన్స్ లీడర్) ,  క్వాంటెలా (డేటా-డ్రివెన్ అర్బన్ గవర్నెన్స్,  సస్టైనబిలిటీ సొల్యూషన్   గ్లోబల్ స్మార్ట్ టెక్నాలజీ )ల ఇనిషియేటివ్. ఈ నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్ బాధ్యతాయుతమైన ,  ఇన్‌క్లూసివ్ AIకి అనుగుణంగా సిటిజన్ చాలెంజెస్‌ను పరిష్కరించడానికి AI శక్తిని ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.                         

గూగుల్ క్లౌడ్ ఇండియా ఈ ఇనిషియేటివ్‌కు సిస్టమ్స్, కెపాసిటీ, నేషనల్-స్కేల్ ఇంపాక్ట్‌ను బలోపేతం చేస్తూ, పబ్లిక్ సెక్టర్‌లో ఇన్నోవేషన్, రియల్-వరల్డ్ అప్లికేషన్ల హబ్‌గా CoEను మలిచేందుకు మద్దతు ఇస్తుంది. గూగుల్ క్లౌడ్‌ల మద్దతు ద్వారా టెక్‌భారత్‌కు AI డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, జెమిని APIs, క్లౌడ్ క్రెడిట్స్, గూగుల్ టీమ్‌లు ,  డొమైన్ ఎక్స్‌పర్టుల నుంచి మెంటర్‌షిప్ సపోర్ట్, ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ AI సొల్యూషన్లను రూపొందించడానికి చేయడానికి సహాయం చేస్తుంది.  అలాగే గూగుల్ GTM టీమ్‌ల నుంచి ఇండియా , ఇతర  ప్రభుత్వాలకు  పరిష్కారాలను చూపిస్తుంది.                        

Continues below advertisement

"టెక్‌భారత్‌తో, మేము అత్యుత్తమ సాంకేతికత , ప్రతిభను తీసుకువచ్చి, రియల్-వరల్డ్ పబ్లిక్ సెక్టర్ చాలెంజెస్ , ఇన్నోవేషన్ అవకాశాలను పరిష్కరించడానికి సహాయపడతాం. టెక్‌భారత్‌తో కలిసి గూగుల్ క్లౌడ్, ఇండియాలో బిల్ట్ స్కేలబుల్ సొల్యూషన్లను  రూపొందిస్తుంది.   " అని గూగుల్ క్లౌడ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ డైరెక్టర్ ఆషిష్ ప్రకటించారు.   

"పారడైమ్ IT , క్వాంటెలాలో  బిజినెస్‌ల కోసం మాత్రమే కాకుండా సిటిజన్స్, గవర్నెన్స్, ఇండియా AI ఫ్యూచర్ కోసం   AIని  సిద్ధం చేస్తున్నామని గూగుల్ కోలాబరేషన్  వల్ల జాతీయ స్థాయి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందన్నారు.