By: ABP Desam | Updated at : 30 May 2023 03:23 PM (IST)
గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫోటో)
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైందని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోతో వైఎస్ఆర్ సీపీ నేతలకు భయం మొదలైందని అన్నారు. తెలుగు దేశం పార్టీ తన మేనిఫెస్టోను ఎంతో పవిత్రంగా చూస్తుందని, టీడీపీ మేనిఫెస్టో ప్రజల గుండెచప్పుడని అన్నారు. మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమే అని అన్నారు. అసలు సినిమా ముందుముందుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం (మే 30) చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.
ఏపీలో విధ్వంస, ఆరాచక పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జగన్ మోహన్ రెడ్డి మెడలు వంచుతున్నాడని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేదం అని ప్రజలను మోసం చేశారని అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ విజయానికి కృషి చేసిన విజయమ్మ, షర్మిల ఈ రోజు ఎక్కడ ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. జగన్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు దూరం అయ్యారని అన్నారు.
యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు నిరుద్యోగులకు వరమని అన్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టం, ఇంటింటింటికి మంచి నీరు చాలా మంచి పథకాలు అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేధోమథనం చేసిన తర్వాతే మేనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. గతంలో దీపం పథకం తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని, ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా ఇస్తామని అన్నారని చెప్పారు.
అరాచకంలో అఫ్గానిస్థాన్
టీడీపీ మేనిఫెస్టోతో వైఎస్ఆర్ సీపీ నేతల్లో గుబులు రేగుతోందని అన్నారు. కొంత మంది ఉక్రోషం తట్టుకోలేక మేనిఫెస్టోను వైఎస్ఆర్ సీపీ నేతలు చించివేశారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని అన్నారు. సీఎం జగన్ అప్పట్లో అమ్మ ఒడి అందరికీ ఇస్తామని నమ్మించి, ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అరాచకంలో అఫ్గానిస్థాన్, అప్పుల్లో శ్రీలంకను మించిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని మాట తప్పారని అన్నారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాను మెడలు వంచి తెస్తామన్నారని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఈయనే మెడలు వంచుతున్నారని ఎగతాళి చేశారు.
గాలికి 3 వేల పెన్షన్ హామీ
సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ మాట తప్పారని అన్నారు. 30 లక్షల ఇళ్ల నిర్మాణం అని, 3 వేల ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ కూడా అంతే గాలికి వదిలేశారని అన్నారు. 3 వేల పెన్షన్ అనే హామీ కూడా గుర్తుపెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఎంత పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. రైల్వే జోన్, పోలవరంలోనూ మాట తప్పి మడమ తిప్పారని అన్నారు. కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు వైఎస్ జగన్ తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం చంద్రబాబుదని అన్నారు. నరకాసుర పాలనకు చమరగీతం పాడాలని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. టీడీపీ అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.
Vizag Murder: భార్యపై అనుమానం, స్నేహితుడి హత్య! మూడో అంతస్తు నుంచి తోసేసిన ఫ్రెండ్
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్- 528 పోస్టులకు వారంలో నోటిఫికేషన్
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>