Araku Special Trains: న్యూ ఇయర్‌తోపాటు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అరకు వెళ్లే టూరిస్ట్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్ని బస్సులు రైళ్లు వేసినా ఎన్ని బస్సులు రైళ్లు వేసినా ప్రయాణికుల రద్దీకి అవి సరిపోవడం లేదు. దానితో ఇంకో కొత్త రైలును అనౌన్స్ చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే.

Continues below advertisement

08525-విశాఖపట్నం-అరకు స్పెషల్ ట్రైన్

30.12.2025 అంటే మంగళవారం నుంచి 18.01.2016వరకూ ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ రోజూ ఉదయం 8:40కి వైజాగ్‌లో బయల్దేరే ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:30కి అరకు చేరుకుంటుంది. దారిలో సింహాచలం (08:55), కొత్తవలస (09:10),శృంగవరపుకోట (09:35), బొర్రా గుహలు (11:10)స్టేషన్లలో ఆగుతుంది.

తిరుగు ప్రయాణంలో 08526 నెంబర్ గల ట్రైన్ అవే తేదీల్లో అంటే 30.12.2025 నుంచి 18.01.2026 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ అరకులో మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:00 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో 2AC-1,3AC 1,స్లీపర్ క్లాస్ 10,జనరల్-03,జనరల్ కమ్ లగేజ్-01 ఉంటాయని ప్రయాణికులు ఈ ట్రైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు కోరారు.

Continues below advertisement

అరకు హౌస్ ఫుల్ 

మరో వైవు టూరిస్ట్‌లతో అరకు హౌస్ ఫుల్ అయిపోయింది. ఇయర్ ఎండ్, వరుస సెలవులతో పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో అరకు లోయలో హోటల్స్ అన్ని హౌస్ ఫుల్ అయిపోయాయి. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి పెద్ద ఎత్తున వస్తున్న టూరిస్టులతో అరకు రోడ్లు ఫుల్ అయిపోవడంతో ఘాట్ రోడ్లలో పోలీస్ ఆంక్షలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక ఈ సీజన్‌లో బాగా పెరిగింది అని అక్కడి హోటల్స్ యజమానులు చెబుతున్నారు. దట్టమైన పొగమంచు అందాలను ఎంజాయ్ చేస్తున్న టూరిస్టుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్లలో పరిమితికి మించి వాహనాల రాకపోకలు పెరిగి పోయాయి. దానితో ముందుగానే రూమ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.