ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, మంచి నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేవు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు సరిగా లేవు.
Alluri District: అల్లూరి జిల్లాలో నిండు గర్భిణీకి డోలీ కష్టాలు.. ఎవరి ప్రాణాలు పోతాయోనని భయం!
నిండు గర్భిణీకి నొప్పులు రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీ కట్టి కుటుంబసభ్యులు 7 కి.మీ మోసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

- స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలైనా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు లేవు.
- అల్లూరి జిల్లాలో గర్భిణిని డోలీలో 7 కి.మీ మోశారు.
- అత్యవసర వైద్యానికి రోడ్లు లేక గిరిజనులు తీవ్రంగా బాధపడుతున్నారు.
- మౌలిక వసతులు కల్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్.
తడకపల్లి: స్వాతంత్య్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావొస్తున్నా పలు రాష్ట్రాల్లో ఇంకా అన్ని ప్రాంతాలకు రోడ్డు, మంచి నీటి, విద్యుత్ సౌకర్యాలు సరిగ్గా లేవు. అలాంటి ప్రాంతాల్లో ఏపీలోని ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేక గిరిజనులు పడుతున్న తీవ్ర అవస్థలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నిండు గర్భిణీని అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు కనీస రోడ్డు సదుపాయం కూడా అందుబాటులో లేకపోవడంతో, కుటుంబ సభ్యులే ఆమెను డోలీలో కిలోమీటర్ల వేర మోసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలోని తడకపల్లి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణీని ఆమె కుటుంబ సభ్యులు సుమారు 7 కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలతో కూడిన కష్టతరమైన బాటలో డోలీలోనే మోసుకెళ్లాల్సి వచ్చింది. నెలలు నిండిన గర్భంతో ఉన్న మహిళను అంతటి దూరం మోయడం కుటుంబ సభ్యులకు అత్యంత శ్రమతో కూడుకున్నదిగా మారింది. తీసుకెళ్తుంటే కొండలు, గుట్టల్లో జారి పడిపోతే కనుక అటు గర్బిణీతో పాటు తీసుకెళ్లే వారి ప్రాణాలు సైతం ప్రమాదంలో పడతాయని చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, అత్యవసర సమయాల్లో ఇప్పటికీ డోలీనే ఆధారంగా చేసుకోవడం గిరిజనులను నేటికీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి చేరకముందే దారిలోనే ప్రాణాలు వదిలే పరిస్థితులు ఉన్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో, ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం లేక కుటుంబ సభ్యులే డోలీ కట్టాల్సి వచ్చింది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని, మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. రహదారులు, రవాణా వసతులు లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రతిసారీ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలకు ఎప్పటికి శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Frequently Asked Questions
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి?
తడకపల్లిలో గర్భిణికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది?
రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, తడకపల్లికి చెందిన ఓ నిండు గర్భిణిని ఆమె కుటుంబ సభ్యులు 7 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.
రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు ఏమిటి?
అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ కూడా రావడం లేదు. గర్భిణులు, పసిపిల్లలు, వృద్ధులు ఆసుపత్రికి చేరకముందే దారిలోనే ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలకు సంబంధించి గిరిజనులు ప్రభుత్వం నుండి ఏం కోరుతున్నారు?
ఎన్ని ప్రభుత్వాలు మారినా మౌలిక వసతులు కల్పించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. రహదారులు, రవాణా వసతులకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























