అన్వేషించండి

Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Pawan Kalyan on Srikakulam Stampede | కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను, గాయపడినవారిని పరామర్శించేందుకు జనసేన ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.

Srikakulam Kasibugga Temple Stampede | కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఘటనా స్థలికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. 

తొక్కిసలాటకు కారణాలపై జనసేన క్షేత్రస్థాయిలో పరిశీలన

ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగ మాధవిలను కాశీబుగ్గ ఘటన మృతుల కుటుంబాలను పరామర్పించి ఓదార్చాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి పవన్ కళ్యాణ్ కు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నివేదిక అందిస్తారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నేత పిసిని చంద్రమోహన్, కొరికాన రవికుమార్, డా. దానేటి శ్రీధర్, గేదెల చైతన్య తదితరులు కాశీబుగ్గ ప్రాంతానికి వెళ్ళి బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారని జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు పవన్ కళ్యాణ్. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా 9 మంది మృతిచెందారని తెలిసి ఆవేదన లోనయ్యారు. ఈ ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి కూటమి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలను ఏపీ ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు.

ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుంది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఆలయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Car Blast Case Update : ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
AP CM Chandrababu: 2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు-  సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు- సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
Khanapur MLA Vedma Bojju: అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
Delhi Blast CCTV Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Viral Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Car Blast Case Update : ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
ఢిల్లీ పేలుడు కేసులో బిగ్‌ట్విస్ట్‌- ఎరుపు రంగు ఫోర్డ్ కారు కోసం వెతుకులాట, అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు
AP CM Chandrababu: 2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు-  సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
2029 నాటికి ఏపీలో ప్రతి పేదవాడికి సొంతిల్లు- సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
Khanapur MLA Vedma Bojju: అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
Delhi Blast CCTV Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Viral Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
Embed widget