Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం, అసలేం జరిగిందంటే?

Adimulapu Suresh: విశాఖ ఆర్కే బీచ్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్ చేస్తుండగా కు ప్రమాదం జరిగింది. కానీ మంత్రి మాత్రం క్షేమంగా బయట పడ్డారు. 

Continues below advertisement

Adimulapu Suresh: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు పెను ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో... ప్రారంభంలోనే కుదుపులు చోటు చేసుకున్నాయి. అలాగే ఇంజిన్ మొత్తం ఓ వైపుగా వంగిపోయింది. వెంటనే విషయాన్ని గుర్తించిన మంత్రి వ్యక్తిగత సిబ్బంది.. ఆయన్ను ఆపారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున నిర్వాహకులపై అసహనం వ్యక్త చేశారు. జీ20 సదస్సు సన్నాహక మారథాన్ ను ఈరోజు ఉదయం మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్ విడదల రజినీ ప్రారంభించారు. 5కే, 10కే మారథాన్ లను ప్రారంభించారు. అయితే ఈ మారథాన్ ను ప్రారంభించిన తర్వాత నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్ కు వెళ్లారు. 

Continues below advertisement

అయితే ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నం వేదికగా జీ20 సన్నాహక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు విడుదల రజిని ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్ నాథ్ లు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Continues below advertisement