News
News
X

విశాఖ ఎయిర్‌పోర్టులో బైఠాయించిన లోకేష్‌- పలాస వెళ్లేందుకు అనుతించకపోవడంపై ఆగ్రహం

విశాఖ ఎయిర్‌పోర్టులో బైఠాయించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. తమ పర్యటనలు అంటే ఎందుకంత భయమో చెప్పాలన్నారు

FOLLOW US: 

పలాస వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మార్గ మధ్యలో అరెస్టు చేసిన పోలీసులు విశాఖ తరలించారు. అక్కడి నుంచి అమరావతి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తాము పలాస వెళ్లిన తర్వాత తిరిగి వెళ్తామని లోకేష్‌ తేల్చి చెప్పారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు.  

జేసిబిలు పంపి పేదలు, టిడిపి నేతల ఇళ్లు కూల్చడంతో జగన్ రెడ్డి, వైసిపి నేతల ఫ్యాక్షన్ బుద్ధి మరోసారి బయటపడిందని విమర్శించారు నారా లోకేష్‌. కనీసం పరామర్శకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చేస్తున్న పోలీసులు... పౌరుల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. 

పలాసలో జరుగుతున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్న నారాలోకేష్‌... తనను అరెస్టు చేసి ఊరంతే తిప్పారన్నారు. దీన్ని చూసి జగన్ చాలా సంతోషంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. తన పర్యటనను అడ్డుకోవడానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపైన, శాంతిభద్రతలు కాపాడటంపై పెడితే పరిస్థితులు కాస్తయినా మెరుగుపడతాయి సూచించారు లోకేష్‌. 

ఆంధ్రప్రదేశ్‌లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని విమర్శించారు లోకేష్‌. పలాస, శ్రీకాకుళం వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పేరు జేసీబీరెడ్డిగా మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. తమను ఆందోళన చేయనివ్వని... జగన్... వైసీపీ లీడర్లను అరెస్టు చేయగలరా అని ప్రశ్నించారు. 

అసలు జగన్‌ మోహన్ రెడ్డికి తామంటే ఎందుకు అంత భయమని... తమ పేరు వింటేనే వణికిపోతున్నారన్నారు లోకేష్‌. తాము చేసిన తప్పేంటని... తమను ఎందుకు అరెస్టులు చేస్తున్నారో సమాధాం చెప్పాలన్నారు. మీడియాతో మాట్లాడినా కూడా అరెస్ట్ చేస్తారా ఆ స్వేచ్ఛ కూడా తమకు లేదా అని నిలదీశారు లోకేష్‌. 

రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్‌కు పాలేరులు మాదిరి పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్‌. కీలు బొమ్మలా మారి పోలీస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నియంతలా వ్యవహరించే జగన్ రెడ్డికి ప్రజల చేతిలో బడిత పూజ తప్పదని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమన్న లోకేష్... తన పేరు వింటేనే వైసీపీ నేతలు కలవరపడుతున్నారన్నారు. 

శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెనఅషన్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు పలాస రాబోతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పలాస పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డుమార్గంలో వెళ్తోన్న లోకేశ్ ను శ్రీకాకుళం సమీపంలో హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొత్తరోడ్డు కూడలి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్పతో సహా ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు.  

నేతలు, పోలీసుల మధ్య తోపులాట..!

అలాగే పలాస నందిగామ మండలం పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ వివాహానికి వెళ్తోన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లికి వెళ్లొద్దని పోలీసులు అడ్డుకున్నారు. పలాసలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో నారా లోకేశ్ పలాస చేరుకోనున్నారు. ఇప్పటికే పలాసలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.  

ఓవైపు వైసీపీ పిలుపు, మరోవైపు లోకేష్ పర్యటన..

ఆదివారం ఓవైపు వైసీపీ  శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో  టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారమే పలాస పర్యటన ఖరారు చేశారు. జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు వివాహానికి వస్తున్న లోకేష్.. పలాస కూడా వెళ్లి అక్కడి కౌన్సిలర్ సూర్య నారాయణకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఆ పట్టణానికి చేరుకున్నారు. శుక్రవారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిరీషను లక్ష్మీపురం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డు కుని వెనక్కి పంపించిన విషయం విదితమే. శనివారం మరలా ఎంపీ, శిరీష వెళ్లి మీడియా సమావేశంలో పాల్గొని అధికార పక్షాన్ని, మంత్రి  అప్పలరాజును దుయ్యబట్టారు. రాజకీయ పోరులో తగ్గేదేలే అన్నట్టుగా సవాళ్లు విసురుకుంటున్నారు. 

అధికారులు ఆ కాలనీ విషయం తేల్చాల్సిందిపోయి ఆ పార్టీ నేతలే స్వయంగా రంగ ప్రవేశం చేసి  అప్పల సూర్యనారాయణ ఇల్లును కూలదోయడమే లక్ష్యంగా ప్రకటనలు చేయడం ఓవైపు చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు మంత్రి అప్పలరాజుపై కూడా టీడీపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలను ప్రతిష్టా త్మకంగా తీసుకుని తమ పవర్ ఏమిటో చూపి స్తామన్న ధోరణిలో వైసీపీ శ్రేణులు ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 

Published at : 21 Aug 2022 04:16 PM (IST) Tags: YSRCP Lokesh Jagan‌ TDP Jagan Palasa

సంబంధిత కథనాలు

Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య

Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య

కార్ బార్బెక్యూ- ఇండియాలోనే మొదటిసారిగా వైజాగ్‌లో!

కార్ బార్బెక్యూ- ఇండియాలోనే మొదటిసారిగా వైజాగ్‌లో!

Vizag Temple: అమ్మవారి గర్భాలయం మొత్తం నోట్ల కట్టలూ, బంగారమే - చూస్తే మీ కళ్లు జిగేల్

Vizag Temple: అమ్మవారి గర్భాలయం మొత్తం నోట్ల కట్టలూ, బంగారమే - చూస్తే మీ కళ్లు జిగేల్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?