విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. కేంద్రం ప్రకటన చేసే వరకు తన దీక్ష కొనసాగుతుందని లేదా నా ప్రాణాలు పోయేవరకు ఈ దీక్ష కొనసాగుతుందని కేఏ పాల్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో తనకు ఏదైనా జరిగితే దానికి నరేంద్ర మోదీ, అమిత్ షానే బాధ్యత అని అన్నారు. 


నరేంద్ర మోదీతో పాటుగా, అదానీ తొత్తులు కొంతమంది విశాఖ స్టీల్‌పై తాను వేసిన పిటిషన్ ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. దాదాపు రూ.8 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ను, రూ.4 వేల కోట్లకి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. కేంద్రం స్టీల్ ప్లాంటు అమ్మనని ప్రకటన చేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన డబ్బులు తాను సమకూర్చుతానని అవసరమైన డబ్బులు సమకూర్చుతాను అనుమతి ఇవ్వండని కోరారు.


కేంద్రం ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదు.. మోదీ ప్రభుత్వం ఏమి చేయకుండా దోచుకోవడమే చేస్తుంది.. టీడీపీ జనసేన కార్యకర్తలారా నాతో కలవండి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు, మోదీకి, భయపడకండి మాతో కలిసి రండి మద్దతు ప్రకటించండి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలి.. నా దీక్షకు మద్దతు ఇవ్వాలి.. అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా మోదీతో కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయాలి’’ అని కేఏ పాల్ పిలుపు ఇచ్చారు.