అన్వేషించండి

Andhra University: వందేళ్ల ఆంధ్రా యూనివర్సిటీ మత వివాదాలకు వేదికగా మారుతోందా?

Andhra University: వందేళ్ల ఆంధ్రా యూనివర్సిటీలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత పోలీసులు భారీ బలగాలను మోహరించాల్సి వచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Andhra University: వైజాగ్‌లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయం ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఈ వందేళ్లలో ఎన్నడూ లేనట్టు ప్రస్తుతం అక్కడ మత రాజకీయాలు మొదలవుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది అక్కడి పరిస్థితులు చూస్తుంటే. ఇంతవరకూ విద్యార్థి సమస్యలు, హాస్టల్ ఫీజులు లాంటి అంశాలపై వివాదాలు చెలరేగడం చూసిన AU తొలిసారి విద్యార్థుల మధ్య మతపరమైన ఘర్షణలకు సాక్షి గా నిలుస్తోంది.

రైట్ వింగ్ vs లెఫ్ట్ వింగ్ : AUలో  తీవ్ర ఉద్రిక్తత 

గత కొన్ని రోజులుగా AUలో RSS ప్రభావిత విద్యార్థులు వామపక్ష అనుబంధ విద్యాసంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అవి ఇప్పుడు ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లైంట్‌లు ఇచ్చుకోవడం పరస్పర దాడులు చేసుకోవడం వరకూ వచ్చేసింది. ఏకంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం కోసం వైస్ ఛాన్స్‌లర్ కార్యాలయం ముందు గుమికూడటం సహా ఏకంగా దాడులు చేసుకునేంత వరకూ వచ్చేసింది. దీంతో అసలు VC ఎవరి ఫై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు 

AUలోకి బయటి వ్యక్తులు వచ్చి విద్వేషాలు రెచగొడుతున్నారు : లక్ష్మి, PDSO సంఘ విద్యార్థి 

యూనివర్సిటీలోకి బయటి వ్యక్తులు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి లక్ష్మీ అన్నారు. ఇలా ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని తెలిపారు. కావాలనే RSS, ABVP వ్యక్తులమని కొందరు వచ్చి రోజూ సాయంత్రం పూట కాలేజీ గ్రౌండ్‌లో కర్రలు పట్టుకుని కవాతు, కసరత్తు చేస్తూ నినాదాలు చేస్తున్నారని పరోక్షంగా విద్యార్థుల మధ్య ఘర్షణ రేపే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు. వాళ్లలో చాలామంది AU క్యాంపస్‌కు చెందిన వారు కాదని అలాంటి వారిని రానీయవద్దు అన్నందుకు తమపై దాడి చేశారని లక్ష్మి  తెలిపారు. ఆడపిల్లలమని చూడకుండా తమపై చెప్పులు, వాటర్ బాటిల్స్ విసిరారని అసహ్యకరమైన పదజాలం వాడుతున్నారని AUలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రగతి అన్నారు. AUని కేవలం విద్యార్థులు వారి చదువుకు మాత్రమే పరిమితం చెయ్యాలని ఎలాంటి మతపరమైన అంశాలు యూనివర్సిటీలో ఉండొద్దనేది తమ డిమాండ్‌గా ఆమె తెలిపారు.


Andhra University: వందేళ్ల ఆంధ్రా యూనివర్సిటీ మత వివాదాలకు వేదికగా మారుతోందా?

భారత మాతాకీ జై అనడం తప్పా : ABVP నేత  నితిన్ 

తాము గత 6నెలలుగా ప్రతీ రోజూ AU గ్రౌండ్స్‌లో కవాతు చేస్తున్నామని ఎలాంటి మత ప్రచారం చెయ్యడం లేదనీ అన్నారు ABVP విశాఖ జిల్లా కార్యదర్శి నితిన్. విద్యార్దుల్లో దేశ భక్తిని పెంపొందించేలా తాము కార్యక్రమాలు చేపడుతుంటే వామపక్ష ప్రేరేపిత విద్యార్థి సంఘాలు ముందుగా తమపై దాడి చేశాయని ABVP సంఘ నేతలు ఆరోపించారు. ఒకవైపు దేశ ప్రతిష్ట చాటేలా మిలన్ కార్యక్రమం వైజాగ్‌లో జరుగుతున్న రోజే దాని ప్రతిష్ట దెబ్బ తీసేలా SFI, PDSO లాంటి సంస్థలు పని చేస్తున్నాయని వారు ఆరోపించారు.


Andhra University: వందేళ్ల ఆంధ్రా యూనివర్సిటీ మత వివాదాలకు వేదికగా మారుతోందా?

AUఫై పట్టు కోసమే మత వివాదాలు సృష్టిస్తున్నారా?

ఆంధ్రా యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ట అందరికీ తెలిసిందే. వైజాగ్ నగరం ఒక గ్లోబల్ సిటీగా మారుతోన్న తరుణంలో నగరంతోపాటు AUపై కూడా పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని దాని ఫలితమే ఇలా విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించే కార్యక్రమం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు రెటైర్డ్ AU ప్రొఫెసర్ జాన్. ఆంధ్రా యూనివర్సిటీలో ఎన్నడూ ఇలాంటి మతపరమైన గొడవలు లేవని అందరూ కలిసి మెలిసి ఉంటారని చెబుతూనే ఇలాంటి వివాదాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన. మరి దీనిపై యూనివర్సిటీ VC రాజశేఖర్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుని ఈ వివాదానికి ఆదిలోనే ఎలా ఫుల్ స్టాప్ పెడతారో అందరూ ఉత్కంఠ తో చూస్తున్నారు

Frequently Asked Questions

ఆంధ్రా యూనివర్సిటీలో ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నాయి?

ఆంధ్రా యూనివర్సిటీలో RSS ప్రభావిత విద్యార్థులు, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది పరస్పర దాడులు, పోలీస్ ఫిర్యాదుల వరకు వెళ్లింది.

విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు కారణం ఏమిటి?

కొంతమంది బయటి వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. RSS, ABVP వ్యక్తులమని కొందరు కర్రలు పట్టుకుని కవాతులు చేస్తూ, నినాదాలు చేస్తున్నారని తెలిపారు.

ABVP విద్యార్థి సంఘం వాదన ఏమిటి?

తాము విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతుంటే, వామపక్ష ప్రేరేపిత విద్యార్థి సంఘాలు తమపై దాడి చేశాయని ABVP నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ మత వివాదాలు AUపై పట్టు సాధించేందుకే సృష్టిస్తున్నారా?

వైజాగ్ ఒక గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో, AUపై కూడా పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, దాని ఫలితమే ఈ విభేదాలని కొందరు అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Advertisement

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget