Memantha Siddham Yatra: ఈ "సిద్ధం" వైఎస్సార్ సీపీ జైత్రయాత్రకు సంకేతం అని.. ప్రజలను మోసం చేస్తున్న ప్రతిపక్షాల కూటమి చెంపచెళ్లుమనిపించేందుకు మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ అడిగారు. సిక్కోలు ప్రజలు సింహాల్లా కదలి వచ్చారని అన్నారు. సిక్కోలులోని జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ జన సముద్రాలే కనిపించాయని.. శ్రీకాకుళం జిల్లాలో జన సముద్రం కనిపిస్తోందని అన్నారు.
డబుల్ సెంచరీకి మీరంతా సిద్ధమా?
‘‘రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరుకు జన సునామీ చూశాం. విద్యా, వైద్య, ఆరోగ్యం రంగాల్లో మార్పులు తీసుకువచ్చాం. గ్రామ స్వరాజ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగు నింపాం. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు. ఎన్నికల్లో డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా? రాష్ట్ర చరిత్రలో మరో చారిత్రక విజయాన్ని చేరుకునేందుకు మీరంతా సిద్ధమా.. డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా.. పేదల వ్యతిరేక కూటమికి చెంప చెళ్లు అనిపించేందుకు మీరంతా సిద్ధమేనా?
మన ప్రభుత్వంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు మెరుగుపడిన ప్రభుత్వ వైద్య రంగం సిద్ధం. ఇంటికే పౌర సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థ సిద్ధం. మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు బాగుపడిన ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం. సొంత ఊళ్ళోనే సేవలు అందించేందుకు 15002 గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం.
జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముంగిపే. మూడు పార్టీల కూటమి మెసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదనీ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
చంద్రబాబువి అబద్ధపు హామీలు
చంద్రబాబు మంచి పనులు చేశానని చెప్పుకోలేడు. అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. ఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూ..? ఎన్నికల్లో మోసం చేసి, కుట్రలు, కుతంత్రాలతో గెలవాలి అనుకునే చంద్రబాబుకు అయన ఆధ్వర్యంలో జతకట్టిన జెండాలకు ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పాలి. అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. అధికారం. వస్తే దోచుకోవడం, పంచుకోవడమే వారి అలవాటు.
చంద్రబాబులా నేను మోసపు హామీలు ఇవ్వను. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయతీపరుడు కావాలా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు, చేశాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా? సింగపూర్‌ను మించి అభిృద్ధి చేస్తానన్నాడు చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు నిర్మించాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.