Araku Assembly Seat : వైసీపీ (Ycp) అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Electons) గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా తాడేపల్లికి ఎమ్మెల్యేలను పిలుపించుకొని మాట్లాడుతున్నారు. టికెట్ ఇవ్వని నేతలకు సర్దిచెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వడంలో వివరిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్‌ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 


అరకు అసెంబ్లీ అభ్యర్థిగా జడ్పీటీసీ మత్స్యలింగం ఖరారు
హుకుంపేట జడ్పీటీసీ రాగం మత్స్యలింగంను అరకు అసెంబ్లీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అరకు సిటింగ్‌ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవిని సమన్వయకర్తగా నియమించారు. దీనిపై స్థానిక నేతలు, కార్యకర్తలు... ఆమె ఎక్కడకు వెళ్లినా నిరసనలకు దిగుతున్నారు. మాధవికి వ్యతిరేకంగా, ఫాల్గుణకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ శ్రేణుల నిరసనలతో అలర్టయిన హైకమాండ్.... తాజాగా  గొడ్డేటి మాధవిని తప్పించింది. అసెంబ్లీ అభ్యర్థిగా రాగం మత్సలింగంను ప్రకటించింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, గొడ్డేటి మాధవి పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. మత్స్యలింగాన్ని ప్రకటించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆందోళనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 


మాధవికి వ్యతిరేకంగా అరకు మొత్తం ఆందోళనలు
గతంలో మాధవికి సీటు కేటాయించిన సమయంలో నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అనంతగిరి,డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు మండలాల్లో మాధవికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్థానికేతరాలైన మాధవి వద్దు.. స్థానికులే ముద్దు అని నినాదాలు చేస్తూ అరకులోయలో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు పార్టీ స్థానిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలులో ఆందోళనలు చేశారు. స్థానికుల్లో ఎవరికి టికెట్‌ కేటాయించినా తాము గెలిపించుకుంటాని...ఆశావహులైన సమర్డి రఘునాథ్‌, హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రాగం మత్స్యలింగం, హుకుంపేట మాజీ ఎంపీపీ బత్తిరి రవిప్రసాద్‌ నిరసనలు చేశారు. 


టికెట్ పునరాలోచించాలని హైకమాండ్ కు స్థానికుల వినతి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరకు అసెంబ్లీ టికెట్‌పై పునరాలోచించి స్థానికుల్లో ఎవరికైనా టికెట్‌ కేటాయించాలని కోరారు. పెదబయలు మండల కేంద్రంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద వైసీపీ మండల నాయకులు నిరసన చేశారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ మాధవిని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాధవి ఏనాడూ స్థానిక నేతలను కలవలేదని, కనీసం అరకులో అభివృద్ధి చేయలేదన్నారు. అధిష్ఠానం పునరాలోచించి స్థానికులకు టికెట్‌ కేటాయిస్తే అందరం సమష్టిగా గెలిపించుకుంటామన్నారు. స్థానికులకు టికెట్ కేటాయించకపోతే నియోజకవర్గంలోని వైసీపీ నాయకులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హైకమాండ్ ను హెచ్చరించారు. స్థానికుల్లో ఏ సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చినా తామంతా పని చేస్తామని స్పష్టం చేశారు. అనుకున్నట్లే స్థానికుడైనా జడ్పీటీసీ మత్స్యలింగంకు వైసీపీ టికెట్ కేటాయించింది.