By: ABP Desam | Updated at : 07 May 2023 06:53 PM (IST)
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి: "చెప్పిన పని చేశాకే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను. పని చేయకపోతే మీరు నాకు ఓటేయకండి.." అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి మండలం మూలపేట గ్రామస్తులతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ గడపగడపకు వెళ్లే సమయంలో ఒక వీధిలో తాము చాలాకాలంగా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
రోడ్లు వేసిన తరువాతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతా!
గత ప్రభుత్వంలో తాము చాలాసార్లు ప్రజా ప్రతినిధులకు చెప్పామని, అయినా ఇప్పటికీ తాము రోడ్లకు నోచుకోలేకపోతున్నామని వారు వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి అమర్నాథ్ ఈ ప్రాంతానికి తాను రోడ్లు వేయిస్తానని, రోడ్లు వేసిన తరువాతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని, ఒకవేళ రోడ్లు వేయలేకపోతే తాను మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగనని చెప్పారు. ఆయన మాటలు విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. గ్రామాలలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే తాను చర్యలు తీసుకుంటున్నానని అమర్నాథ్ చెప్పారు.
'అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించలేను కదా?' దశలవారీగా సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని అమర్నాథ్ చెప్పారు. ఈ గ్రామంలో 20 లక్షల రూపాయలతో తక్షణం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని, మరొక పది లక్షల రూపాయలతో కాలువల నిర్మాణాలు చేపట్టాలని మంత్రి అమర్నాథ్ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జలజీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికి మంచినీటి కొళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే శారద నగర్ బ్రిడ్జి నుంచి సత్యనారాయణపురం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా మూలపేటకు రోడ్డు కావాలని స్థానికులు మంత్రి అమర్నాధుని కోరగా త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే గంగాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని వారు కోరారు.
గ్రామంలో లబ్ధిదారులకు పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి ఇంకా పథకాలు అందని వారిని గుర్తించి పథకాలు అందేలా చూడాలని మంత్రి అమర్నాథ్ అధికారులకు సూచించారు. గ్రామంలో కొండల మీద నివసిస్తున్న వారి ఇళ్లకు కూడా మంత్రి నడిచి వెళ్లి వారికి మంజూరైన పథకాలకు సంబంధించిన బ్రోచర్లను అందజేశారు.
అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గ్రామ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, గ్రామస్తుల మొర వినలేదని దీని ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పేరుకు పోయాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులకు వెనకాడకుండా అభివృద్ధే మంత్రంగా ఒక్కో పనిని చేసుకో వస్తున్నామని, ఈ మార్పును ప్రజలు గుర్తించాలని కోరారు. పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందని ఆయన చెప్పారు. గతంలో ఏ మంత్రి అయినా ఇలా గ్రామాలకు వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. అభివృద్ధి చేసి చూపిస్తున్నాo కనుకే ప్రజా ప్రతినిధులమంతా ధైర్యంగా గడపగడపకు రాగలుగుతున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ గ్రామంలోని వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించారు.
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్ టూర్‌లో కేటీఆర్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!
AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!