Minister Achenna: కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తున్నందున వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్‌లోకి వచ్చామని రాష్ట్ర మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ వ్యవస్థలన్నీ చిన్నాభిన్నంగా చేసిందన్నారు. ప్రజలకు మాట్లా డే అవకాశం లేకుండా నియంతగా వ్యవహరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పాలనాపరంగా ఉన్నఅనుభవంతో కూటమి ప్రభు త్వాన్ని ఆరునెలలో గాడిలోనికి తీసుకు వచ్చారన్నారు.
ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిలో పెట్టాం !
పార్వతీ పురం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎవరూ ఊహించని విధంగా ఆరు నెలల్లో వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. కేంద్రం బాగా సహకరిస్తుందిపెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. వాలంటీర్లు లేకుండా పాలన లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు మాసాలకు ముందే పింఛన్ పెంచాం.. సకాలంలో అందిస్తున్నామన్నారు. భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చేవారు కాదు. ఏదైన కారణంతో భర్త చనిపోతే ఆ వితంతుకు ప్రభుత్వం అండగా ఉండేందుకు పింఛన్ అందిస్తున్నామన్నారు. అన్నా క్యాంటిన్లు పెట్టామన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హమీ ఇచ్చాం. వాటిన్నింటిని నెరవేస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయకపోవడం ఈ సర్కార్ అందిస్తున్న సహకారానికి నిదర్శనమన్నారు.
త్వరలో అన్నదాత సుఖీభవ
అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రూ.20 వేలు ఇస్తాం. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రైతులకు రూ.145 కోట్లతో యంత్ర పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.860 కోట్లతో రహదారులు బాగు చేస్తున్నాం. సంక్రాంతికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నది మా లక్ష్యమన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారన్నారు. జిల్లాలో పీహెచ్సీల ద్వార మెరుగైన సేవలందించేందుకు వైద్యులు చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు. రక్తహీనత లోపం జిల్లాలో ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్యం బాగోలేకపోతే డోలు మోతలను నివారించేందుకు ప్రతి గ్రామానికి రానున్న రెండేళ్లలో రహదారి సౌకర్యం కల్పిస్తామని ఇన్చార్జీ మంత్రి భరోసా ఇచ్చారు. దీనికి అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో ప్రధానమంత్రి సుజల యోజన పథకం కింద ప్రతి ఇంటికీ తాగునీటి వసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు
గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
గత ఐదేళ్లలో చాలావరకు నష్టం జరిగిందని, ఇతర రాష్ట్రాల్లో లక్షా ఏభై వేల కోట్ల వరకు నిధులు వెచ్చిస్తే, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి గుర్తుచేశారు. ఇది గిరిజన ప్రాంతామని, 33 శాతం మంది గిరిజనులు ఉండే ప్రాంతామని మంత్రికి కలెక్టర్ వివరించారు. ప్రకృతి సోయగాలకు, సహజసిద్ధ అందాలకు జిల్లా నెలవని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లోని జిల్లా అధికారులను సమన్వయం చేసుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు కలెక్టర్ మంత్రికి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. ప్రధానంగా ఆప్షోర్ రిజర్వాయర్. వంశధార పేజీ టు 80% పూర్తయింది ఇంకో 20% పెండింగ్లో ఉంది అతి త్వరలో అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం. వంశధార .నాగవల్లి నదులు అనుసంధానం. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలావరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు.