గొర్రెల కాపరిగా పనిచేస్తున్న రామయ్య
Ramayya Shepherd Boy: బడిబాట పట్టిన చిన్నారి రామయ్య.. మంత్రి లోకేష్ చొరవతో గొర్రెల కాపలా నుంచి విముక్తి!
Ramayya Shepherd Boy: 8 ఏళ్ల బాలుడు రామయ్య గొర్రెల కాపరిగా మారిన ఉదంతం నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. బాలుడిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- ప్రకాశం రామయ్య దీనస్థితి, వైరల్ వీడియోతో వెలుగులోకి వచ్చింది.
- మంత్రి లోకేష్ ఆదేశాలతో అధికారులు బాలుడిని సురక్షితంగా రక్షించారు.
- కుటుంబ కష్టాలకు ప్రభుత్వం విద్య, వైద్య, గృహ సహాయం అందించింది.
Ramayya Shepherd Boy: ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడులో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న 8 ఏళ్ల బాలుడు రామయ్య విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. "నన్ను ఆదుకునే దిక్కులేక నరకం చూస్తున్నాను" అంటూ ఆ బాలుడు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారడంతో ఈ దారుణ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి, బాలుడిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆర్థిక ఇబ్బందులు.. గొర్రెల కాపరిగా చిన్నారి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలో బాలుడి కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠానికి చెందిన పురుష ఆశీర్వాదం, ఎస్తిరమ్మ దంపతుల కుమారుడే ఈ రామయ్య. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామయ్య నాలుగేళ్ల చెల్లెలి వైద్య ఖర్చులు భరించలేక, పూట గడవక ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని గొర్రెల కాపరిగా పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. సొంత ఇల్లు కూడా లేక గుడిసెల్లో జీవిస్తూ, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ ఆ కుటుంబం పొట్టపోసుకుంటోంది.
24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం
బాలుడి దీనస్థితిని గుర్తించిన అధికారులు, మద్దిపాడు ప్రాంతంలో ఉన్న రామయ్యను సురక్షితంగా రక్షించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. "మీ అందరి ప్రార్థనలు ఫలించాయి.. రామయ్యను సురక్షితంగా ఇంటికి చేర్చాం" అని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో 24 గంటల్లోనే ఈ ఆపరేషన్ను విజయవంతం చేశాయి. వీడియో కాల్ ద్వారా కలెక్టర్ హిమాన్షు శుక్లా రామయ్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్
గొర్రెల కాపరి చాకిరీ నుంచి విముక్తి పొందిన రామయ్య చదువుకుంటాననడంతో, అతడిని వెంటనే రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, ఆ నిరుపేద కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రామయ్య తండ్రి అనారోగ్యానికి పూర్తి వైద్యం అందించడంతో పాటు, తల్లికి స్వయం ఉపాధి కల్పిస్తామని, ప్రభుత్వ పథకం కింద కుటుంబానికి సొంత ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించి, చిన్నారి జీవితంలో వెలుగులు నింపిన మంత్రి నారా లోకేష్, అధికారుల చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పెన్ను, పుస్తకం పట్టాల్సిన వయసులో గొర్రెలు కాసిన రామయ్య ఇప్పుడు బడి బాట పట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Frequently Asked Questions
8 ఏళ్ల బాలుడు రామయ్య ఎందుకు వెలుగులోకి వచ్చాడు?
రామయ్య కుటుంబం ఎక్కడ ఉంది?
అధికారులు గాలింపు చేపట్టగా, రామయ్య కుటుంబం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలో ఉన్నట్లు గుర్తించారు. వారు కడప జిల్లా బ్రహ్మంగారిమఠానికి చెందినవారు.
రామయ్యను గొర్రెల కాపరిగా ఎందుకు పంపాల్సి వచ్చింది?
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, నాలుగేళ్ల చెల్లెలి గుండె సంబంధిత వైద్య ఖర్చులు భరించలేక, పూట గడవక తల్లిదండ్రులు రామయ్యను గొర్రెల కాపరిగా పంపారు.
ప్రభుత్వం రామయ్యకు, అతని కుటుంబానికి ఎలాంటి సహాయం అందిస్తోంది?
రామయ్యను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తారు. తండ్రికి వైద్యం, తల్లికి స్వయం ఉపాధి, ప్రభుత్వ పథకం కింద కుటుంబానికి సొంత ఇల్లు మంజూరు చేస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















