అన్వేషించండి

Gunadala Mary Matha Church: 100 ఏళ్ల గుణదల మేరీ మాత చర్చ్‌లో హిందూ ఆచారాలు ఎందుకు పాటిస్తారు ! 3 రోజలపాటు ఉత్సవాలు

Gunadala Mary Matha Church in Vijayawada: 100 ఏళ్ల గుణదల మేరీ మాత ఆలయం లో హిందూ ఆచారాలు ఎందుకు పాటించడానికి పలు కారణాలున్నాయి. నేటి నుండి మూడు రోజలపాటు జరుగనున్న గుణదల ఉత్సవాలు నిర్వహిస్తారు.

 ప్రతీ ఏడాది మూడు రోజులపాటు ఆంటే ఫిబ్రవరి 9,10,11 తారీకుల్లో జరిగే  విజయవాడలోని ప్రసిద్ధ గుణదల చర్చి ఉత్సవాలు మొదలయ్యాయి. 100ఏళ్ల పైబడ్డ గుణదల మేరీ మాత ఆలయం ఏపీ లోనే చాలా పాపులర్ RCM చర్చ్.  కొండ క్రింద ఆలయం కొండపైన. గుహలో మేరీ మాత విగ్రహం ఉండడం ఇక్కడి విశేషం.

ఫ్రాన్స్ లోని 'లూర్డు ' మాత విగ్రహం ను పోలిన గుణదల మేరీ మాత 

1858 ఫిబ్రవరి 11న ఫ్రాన్స్ లోని లూర్ద్ నగరం పొలిమేర లో ఉన్న ఒక కొండపైన ఉన్న గుహలో 14 ఏళ్ల బాలికకు తొలిసారి మేరీ మాత కనిపించి మాట్లాడింది అని తెలిసి చాలామంది అ కొండపైకి వెళ్ళి పూజలు చేయడం మెదలు పెట్టారు.. ఆ బాలికకు  మేరీ మాత చెప్పిన సూచనల మేరకు గుహలో ఒక  విగ్రహాన్ని కొండక్రింద ఆలయాన్ని కట్టారు. ఆ విగ్రహాన్ని 'our Lady of Lourdes ' అని పిలుస్తారు.  1924లో సరిగ్గా అదే విగ్రహాన్ని పోలిన మేరీ మాత విగ్రహాన్ని విజయవాడ లోని గుణదల కొండపై ఉన్న గుహలో ప్రతిష్టించారు ఇటలీకి చెందిన ఫాదర్ అర్లాటి. విజయవాడలో బ్రిటిష్ ప్రభుత్వం అనాధల కోసం సెయింట్ జోసఫ్ ఇన్స్టిట్యూర్ అనే సంస్థ ను ఏర్పాటు చేసినప్పుడు ఇది జరిగింది. దానికి ఫాదర్ ఆర్లాటి నే రెక్టర్ గా ఉండేవారు. కొండపై గుహలో మేరీ మాత విగ్రహం, బలి పీఠం ఆయన ఏర్పాటు చేస్తే కొండక్రింద చర్చ్ ను తరువాత కట్టారు.


Gunadala Mary Matha Church: 100 ఏళ్ల గుణదల మేరీ మాత చర్చ్‌లో హిందూ ఆచారాలు ఎందుకు పాటిస్తారు ! 3 రోజలపాటు ఉత్సవాలు

బాలికకు మేరీ మాత కనిపించిన ఫిబ్రవరి 11న ప్రతీ ఏడు ప్రత్యేక కార్యక్రమాలు జరపాలని ఫ్రాన్స్ లోని చర్చ్ భావించినా భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో ఉత్సవాలు జరపడం మొదలుపెట్టారు. విజయవాడ నగరం లో కూడా అదేవిదంగా ప్రతీ ఏడూ అదే తేదీల్లో గుణదల చర్చ్ ఉత్సవాలు జరుపుతున్నారని, వీటికి లక్షల సంఖ్య లో ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తారని విజయవాడ క్యాథలిక్ పీఠం బిషప్ జోసప్ రాజారావు అన్నారు.


Gunadala Mary Matha Church: 100 ఏళ్ల గుణదల మేరీ మాత చర్చ్‌లో హిందూ ఆచారాలు ఎందుకు పాటిస్తారు ! 3 రోజలపాటు ఉత్సవాలు

గుడిలో హిందూ సంప్రదాయాలు ఎందుకంటే 

సాధారణం గా క్రైస్తవులు చర్చ్ లో తలనీలాలు ఇవ్వడం, కొబ్బరి కాయలు కొట్టడం వంటివి చెయ్యరు. కానీ గుణదల మేరీ మాత కు కోర్కెలు తీరితే గుండు కొట్టించుకుంటామని మొక్కుకోవడం, కొబ్బరి కాయలు కొట్టడం వంటి హిందూ సంప్రదాయాలు గుణదల చర్చ్ లో చూస్తుంటాము. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. RCM ( రోమన్ క్యాథలిక్ చర్చ్ ) విస్తరించేటప్పుడు ఇతర దేశాల్లో  అమల్లో ఉన్న ఆచారాలు సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలిగించకుండా  క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేవి. అందుకే హాస్యం చర్చ్ ల్లో సంప్రదాయాలు అవి ఉన్న దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి.


Gunadala Mary Matha Church: 100 ఏళ్ల గుణదల మేరీ మాత చర్చ్‌లో హిందూ ఆచారాలు ఎందుకు పాటిస్తారు ! 3 రోజలపాటు ఉత్సవాలు

ఇండియాలో హిందూ సంప్రదాయం అధికం కాబట్టి  ఇక్కడ ఉన్న మేరీ మాత చర్చ్ ల్లో అవి ఆచారాల్ని కంటిన్యూ చేస్తున్నట్టు  చరిత్రకారులు, గుణదల చర్చ్ ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. ఏడాది జరుగుతున్న గుణదల చర్చి ఉత్సవాలకు ప్రతీ ఏడు లానే కుల మతాలకు అతీతంగా  లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని బిషప్ జోసెఫ్ రాజారావు అన్నారు.


Gunadala Mary Matha Church: 100 ఏళ్ల గుణదల మేరీ మాత చర్చ్‌లో హిందూ ఆచారాలు ఎందుకు పాటిస్తారు ! 3 రోజలపాటు ఉత్సవాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget