విజయవాడ డివిజన్‌ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు కారణంగా కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి అంటే డిసెంబర్‌ 4 నుంచి ఈ ప్రకటన అమలులోకి రానుందని తెలిపారు.


కాకినాడ పోర్టు విశాఖ మధ్య నడిచే 17267, 17268 నెంబర్‌ ట్రైన్‌ను రద్దు చేశారు. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ ట్రైన్‌ రద్దు చేశారు. ఈ తేదీల్లోనే మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య నడిచే 17219, 17220 నెంబర్‌ ట్రైన్‌ను కూడా రద్దు చేశారు. 17243, 17244 నెంబర్‌ ట్రైన్‌ గుంటూరు–రాయగడ మధ్య నడుస్తోంది. దీన్ని డిసెంబర్‌ ఐదు నుంచి 18 వరకు రద్దు చేశారు. బిట్రగుంట, విజయవాడ మధ్య నడిచే 07279, 07978 నెంబర్ గల ట్రైన్, విజయవాడ తెనాలి ట్రైన్‌, విజయవాడ, ఒంగోలు, గూడురు వెళ్లే ట్రైన్స్‌ను 18 వరకు రద్దు చేశారు. 



 విజయవాడ విశాఖ మధ్య నడిచే ట్రైన్‌ 4 నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. 22701 నెంబర్‌తో విశాఖ విజయవాడ మధ్య నడిచే ట్రైన్‌ 9 నుంచి నాలుగు రోజుల పాటు అంటే 13 తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు- విశాఖ మధ్య నడిచే 17239-40 ట్రైన్‌ను నాలుగో తేదీ నుంచి 18 వరకు రద్దు చేశారు. 


బిట్రగుంట- చెన్నై సెంట్రల్‌ మధ్య నడిచే 17237- 38 ట్రైన్‌ను నాల్గో తేదీ నుంచి 8 వరక, 11 వ తేదీ నుంచి 15 వరకు రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. గూడూరు- విజయవాడ మధ్య నడిచే 07458-12743 నెంబర్‌ ట్రైన్ను ఐదు నుంచి 18 వరకు రద్దు చేశారు.


పాక్షింగా రద్దు అయిన ట్రైన్స్‌
మచిలీపట్నం- విజయవాడ ట్రైన్
నర్సాపూర్-విజయవాడ ట్రైన్
విజయవాడ- భీమవరం ట్రైన్‌
ప్రత్యేక రైళ్లు పొడిగింపు 


పూర్ణా-తిరుపతి మధ్య ప్రత్యేక రైలును నాల్గో తేదీ నుంచి 25 వరకు నడపనున్నారు. తిరుపతి-పూర్ణా మధ్య ట్రైన్‌ను ఐదో తేదీ నుంచి 26 రకు నడపనున్నారు. హైదరాబాద్‌, నర్సాపూర్‌, నర్సాపూర్‌ హైదరాబాద్‌ మధ్య నడిపించే ట్రైన్‌ ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు నడపనున్నారు. తిరుపతి సికింద్రాబాద్, మధ్య నడిచే ట్రైన్‌ను ఆదివారం నుంచి వచ్చే నెల 1 వరకు నడపనున్నారు. సికింద్రాబాద- తిరుపతి మధ్య నడిచే ట్రైన్‌ను నాల్గో తేదీ నుంచి 25 వ తేదీ వరకు నడపనున్నారు. కాకినాడ టౌన్‌- లింగంపల్లి, లింగపల్లి- కాకినాడ టౌన్ మధ్య నడిచే ట్రైన్స్‌ను డిసెంబర్‌ 30 వరకు పొడించారు.