స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. 


అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆయన్ని ఏ-1గా చూపించింది సిఐడీ. ఇప్పటికే దీనిపై పీటీ వారెంట్‌ వేసిన సీఐడీ... చంద్రబాబును విచారించేందుకు అనుమతి తీసుకుంది. ఆయనకు స్కిల్స్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వస్తే అమరావతి కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.