అన్వేషించండి

YSRCP Leader Jogi Ramesh: ఇబ్రహింపట్నంలో రాజకీయ రచ్చ; మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌ బెయిలబుల్ కేసులు, అసలేం జరిగింది?

YSRCP Leader Jogi Ramesh: ఇబ్రహీంపట్నంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు కేసు పెట్టారు. పోలీసులు అనుమతి లేకపోయినా జనసమీకరణ చేశారని జోగి రమేష్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

YSRCP Leader Jogi Ramesh: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులను సమీకరించి ప్రజ జీవన విధానానికి ఇబ్బంది కలిగించారని పోలీసులు పెట్టారు. అందులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రికి చిక్కులు తప్పేలా లేవు. ఇంతకీ ఇబ్రహీం పట్నంలో ఏం జరిగింది?   

గొడవ ఎక్కడ మొదలైంది?

ఈ వివాదం జనవరి చివరలో మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జరిగిన చర్చల సందర్భంగా జోగి రమేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించాయి. దీని ఫలితంగా ఫిబ్రవరి 1న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసంపై ఒక భారీ గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేనప్పటికీ తల్లిదండ్రులు, భార్య ఉన్నట్టు చెబుతున్నారు. నిరసనకారులు ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరారు. ఫర్నీచర్ తగలబెట్టారని పోలీసులు గుర్తించారు. 

Image

జగన్ పర్యటన - ఐదున్నర గంటల రోడ్‌ షో

వైసీపీ నేత, మాజీ మంత్రి ఇంటిపై దాడి జరగడంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 6న జోగి రమేష్‌ను పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం రావాలని నిర్ణయించారు. దీని ఒక సామాన్య పరామర్శ పర్యటనలా కాకుండా, పార్టీ బలాన్ని చాటేలా జన సమీకరణగా మార్చారు. అయితే విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాిక్ సమస్యలు వస్తాయని పోలీసులు జగన్ కాన్వాయ్‌ను వెస్ట్‌ బైపాస్ మీదుగా వెళ్లాలని ముందే నోటీసులు ఇచ్చారు. 

Image

కానీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీసుల సూచనలను పట్టించుకోకుండా మెయిన్ రోడ్డు మీదే భారీ బైక్ ర్యాలీతో ముందుకు సాగారు. సాధారణంగా గంటలోపు పూర్తి కావాల్సిన 35 కిలోమీటర్ల ప్రయాణం ఏకంగా ఐదున్న గంటల పాటు సాగింది. ఈ లోపు నేషనల్‌ హైవే పూర్తిగా స్తంభించిపోయింది. అంబులెన్స్‌లు, సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు  పడ్డారు.  

Image

పోలీసులు పెట్టిన కేసులు ఏంటీ?

ఈ ట్రాఫిక్ జామ్‌, నిబంధనల ఉల్లంఘనపై ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా జోగి రమేష్‌పై క్రైమ్‌ నంబర్‌ 76/2026 కింద కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి, ట్రాఫిక్ కంట్రోల్‌ చేయకుండా అడ్డుకున్నారని సెక్షన్ 132 పెట్టారు. బైక్ ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని, ఇది అక్రమంగా గుమిగూడటం కిందకు వస్తుందని సెక్షన్ 189(2) ప్రయోగించారు. జాతీయ రహదారిపై గంటల తరబడి దిగ్బంధించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు కేసు పెట్టారు. రాజకీయంగా చాలా సెన్సిటివ్‌ ఏరియాల్లో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Image

పోలీసులు రిపోర్టులో సున్నిత ప్రాంతాలు అనే పదాన్ని పదే పదే వాడారు. ఇబ్రహీంపట్నం ఏరియాలో కొన్ని చోట్ల టీడీపీ ఆఫీస్‌లు ఉన్నాయి. మరికొన్ని చోట్ల గతంలో గొడవుల జరిగిన చరిత్ర ఉంది. అటువంటి  ప్రాంతాల్లో కావాలనే ర్యాలీని నెమ్మదిగా నడపడం లేదా నినాదాలు చేయం వల్ల మళ్లీ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పాయింట్‌ను బేస్ చేసుకునే పోలీసులు దీనిని సాదాసీదా ట్రాఫిక్ ఉల్లంఘనకు కాకుండా , లా అండ్ ఆర్డర్‌కు ముప్పు కలిగంచే చ్యగా చూస్తున్నారు. దీని వల్ల జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. 

Image

జోగి రమేష్‌  ఇంటిపై దాడి జరగడం అంటే మొత్తం బీసీ సామాజిక వర్గంపై భయపెట్టడమేనని జగన్ మోహన్ రెడ్డి తన పర్యటనలో వ్యాఖ్యానించారు. దీన్ని చూస్తూ ఊరుకోదని జగన్ వార్నింగ్ ఇచ్చారు.  కచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబును దోషిగా నిలబెడతామన్నారు. 

Image

Frequently Asked Questions

ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌పై ఎలాంటి కేసులు నమోదయ్యాయి?

జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ మరియు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జోగి రమేష్‌పై IPC సెక్షన్ 132, 189(2) కింద కేసులు నమోదయ్యాయి. ఇది శాంతిభద్రతలకు ముప్పు కలిగించే చర్యగా పరిగణించబడింది.

జోగి రమేష్ ఇంటిపై దాడికి కారణమేంటి?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన ఉద్దేశ్యం ఏమిటి?

జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన ముఖ్య ఉద్దేశ్యం జోగి రమేష్‌ను పరామర్శించడం. అయితే, ఇది పార్టీ బలాన్ని చాటేలా భారీ జన సమీకరణగా మార్చబడింది.

జగన్ పర్యటనలో ట్రాఫిక్ జామ్‌కు కారణం ఏమిటి?

పోలీసులు సూచించిన వెస్ట్ బైపాస్ మార్గాన్ని కాకుండా, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మెయిన్ రోడ్డు మీదుగా భారీ బైక్ ర్యాలీతో వెళ్లడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget