అన్వేషించండి

Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!

Vijayawada Politics: విజయవాడలో మరోసారి కేశినేని వర్సెస్ కేశినేని రాజకీయాలు ప్రారంభమయ్యాయి. చిన్నిపై నాని బ్లాక్ మనీ ఆరోపణలు చేశారు.

Kesineni Vs Kesineni:   విజయవాడ రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయిలో వేడెక్కాయి. మాజీ ఎంపీ కేశినేని నాని  సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ చేసిన వరుస సంచలన ట్వీట్లు, ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో పెను తుఫాను రేపుతున్నాయి. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్  లక్ష్యంగా.. పోలీసుల వేధింపులు, కోట్లాది రూపాయల బ్లాక్ మనీ దొంగతనం, చివరకు యాసిడ్ దాడి వంటి అత్యంత తీవ్రమైన అంశాలను ప్రస్తావిస్తూ కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ల  వైరల్‌గా మారాయి. 

విజయవాడలో  కేశినేని  బ్రదర్స్ వార్ 
 
కేశినేని నాని తన మొదటి ట్వీట్‌లో.. తాను గత రెండేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నప్పటికీ, తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై అక్రమ క్రిమినల్ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్  ఎస్ఐ నవీన్   రాంబాబు ఇంట్లో లేని సమయంలో వెళ్లి, ఆయన వృద్ధురాలైన తల్లిని తీవ్రంగా వేధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఒత్తిడితోనే పోలీసులు ఇలా  రాజకీయ కక్షసాధింపు కు పాల్పడుతున్నారని, అమాయక కుటుంబాన్ని రక్షించాలని సీఎంను కోరారు.   

 జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు 

ఈ వేధింపుల ఉదంతంపై కేశినేని నాని అంతటితో ఆగకుండా చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఒక అమాయక కుటుంబంపై అర్థరాత్రి వేళల్లో పోలీసులు జరిపిన దాడిపై, వృద్ధురాలైన తల్లిని మానసికంగా ఇబ్బంది పెట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్  కు అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు.

రూ. 27 కోట్ల బ్లాక్ మనీ దొంగతనం మిస్టరీ 

అయితే, ఈ మొత్తం వివాదం వెనుక విజయవాడలో గుసగుసలుగా వినిపిస్తున్న  రూ. 27 కోట్ల బ్లాక్ మనీ దొంగతనం  వ్యవహారం ప్రధాన కారణమని కేశినేని నాని తన మూడో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా సంపాదించినట్లు చెప్తున్న సొమ్ములో దాదాపు రూ. 27 కోట్ల నల్లధనం మాయమైందని, ఈ దొంగతనానికి సంబంధించి ఎంపీ పీఏలు, కార్యాలయ సిబ్బంది అయిన మోహన్, పొన్నం రాజేష్, రామచంద్ర, అంజి ,  హైదరాబాద్‌కు చెందిన నాగ శ్రీనివాసులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.  పరారీలో ఉన్న వ్యక్తుల్లో ఒకరిని కొందరు సన్నిహితులు పట్టుకొచ్చి, ఎంపీ ముందే అతని చేతులపై యాసిడ్ పోసి చిత్రహింసలకు గురిచేశారని నాని ఆరోపించారు.  అయితే ఈ యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పోలీసుల నుండి గానీ, బాధితుల నుండి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదని నానినే తెలిపారు.  

ఈ గుసగుసల్ని నాని అనుచరులు విజయవాడలో వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేస్తూండటంతో.. అవి ఫేక్ అని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ తరపు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా కేశినేనినాని ప్రస్తావించిన  తాతినేని రాంబాబు అతనే ఈ ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని ప్రశ్నించేందుకు పోలీసులు వెళ్లారు. దీన్నే నాని ప్ఱశ్నించారు. 
 
కేశినేని సోదరుల మధ్య ఉన్న పాత రాజకీయ, వ్యక్తిగత వైరం ఈ ట్వీట్లతో మరోసారి పతాక స్థాయికి చేరింది. బ్లాక్ మనీ దొంగతనం, యాసిడ్ దాడి వంటి తీవ్రమైన నేరారోపణలు నేరుగా ఒక సిట్టింగ్ ఎంపీపై రావడం, దానికి తోడు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ ఆరోపణలపై ఇటు విజయవాడ పోలీసులు కానీ, అటు ఎంపీ కేశినేని చిన్ని వర్గం కానీ ఎలా స్పందిస్తుందో, ప్రభుత్వం దీనిపై ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందో రాబోయే రోజుల్లో తేలనుంది. గతంలోనూ కేశినేని చిన్నిపై నాని చాలా తీవ్ర ఆరోపణుల చేశారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget