Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 

Nara Lokesh News: ఒక్క మెసేజ్‌తో నిండు జీవితాలు నిలబడ్డాయి. సకాలంలో స్పందించిన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన నారా లోకేష్‌ ప్రశంసలు అందుకుంటున్నారు.

Continues below advertisement

Nara Lokesh News: ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ ప్రాణం నిలిచింది. ఇక బతుకుపై ఆశలు వదిలేసుకున్న ఓ నిరుపేదకు గుండె అమరింది. ఓ ప్రాణాన్ని నిలపడం కోసం సొంత డబ్బుతో నారా లోకేష్‌ ప్రత్యేకంగా విమానాన్ని సమకూర్చారు. బ్రెయిన్‌ డెడ్ అయిన ఓ మహిళ గుండెను మరో మహిళకు అమర్చడం కోసం.. సాయం చేయమన్న ఒక్క మెసేజ్‌తో ఆయన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాదు గుంటూరు నుంచి తిరుపతి వరకూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. 

Continues below advertisement


తెనాలి ప్రాంతానికి చెందిన చెరుకూరి సుష్మ గుంటూరు రమేష్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె అవయువదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా తిరుపతిలోని ఓ రోగికి గుండె అమర్చాలని నిర్ణయించారు. గుండెను గుంటూరు నుంచి తిరుపతికి వేగంగా తీసుకెళ్లే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో ఆసుపత్రి వర్గాలు లోకేష్‌కు సమాచారం ఇచ్చాయి. ఆయన తన సొంత డబ్బుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. గుంటూరు నుంచి గన్నవరం వరకూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. ఫ్లెయిట్‌లో రేణిగుంటకు గుండెను తరలించి అక్కడి నుంచి ఆసుపత్రి వరకూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. లోకేష్ చొరవతో ఈ ఆపరేషన్ పూర్తయింది. 

గుండెను తిరుపతి తరలించగా సుష్మకు సంబంధించిన మిగిలిన అవయువాలు విజయవాడ, చెన్నైలోకి వివిధ ఆసుపత్రులకు తరలించడానికి లోకేష్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు.

Continues below advertisement