Vijayawada Mayor :   బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అంటే ఇప్పుడు ఏపీ మొత్తం పరిచయమే. ఒకే ఒక్క లేఖతో ఆమె ఈ గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్తగా రిలీజయ్యే ప్రతీ సినిమాకు షోకు వంద టిక్కెట్లు ఇవ్వాలని మేయర్ గా అధికారిక హోదాలో విజయవాడ ధియేటర్ యాజమాన్యాలకు లేఖ రాశారు.ఈ  లేఖ వైరల్ అయింది. ఈ విషయంలో ఆమె రకరకాల విమర్శలు చేశారు. చేస్తున్నారు. ప్రతీ షోకు వంద టిక్కెట్లు తీసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏబీపీకి ఇచ్చిన ఇంటర్యూలో భాగ్యలక్ష్మి భగ్గుమన్నారు. కావాలని బురత చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. 


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయ అనివార్యం: టీడీపీ ఏర్పాటుపై చంద్రబాబు


అయితే ఆ లేఖ ప్రకారం మేయర్‌ కోటా కింద ధియేటర్ యాజమాన్యాలు టిక్కెట్లు పంపుతున్నాయో లేదో స్పష్టత లేదు. మేయర్‌గా అధికారిక హోదాలో అలా రాయడం అధికార దుర్వినియోగమేనని .. టిక్కెట్లు ఇవ్వకపోతే కక్ష సాధింపులు ఉంటాయని బెదిరించడమేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మేయర్ మాత్రం ప్రతి షోకు వంద టిక్కెట్లు కావాలని లేఖ రాస్తే తప్పేముందని భాగ్యలక్ష్మి సూటిగా ప్రశ్నించారు. తాము ఊరకనే అడగలేదని గుర్తు చేస్తున్నారు. అయితే బెజవాడ మేయర్‌పై వస్తున్న ఆరోపణలు ఒక్క టిక్కెట్ల లెటర్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. 


అల్లు అరవింద్ కుమారునికి ఏపీ ఆన్‌లైన్ టిక్కెట్ కాంట్రాక్ట్ ? ఎల్-1 గా నిలిచిన "జస్ట్ టిక్కెట్"


ఇటీవల మేయర్ కోసం కొత్త కారు కొనుగోలు చేశారు. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక విజయవాడలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్న విమర్శలొస్తున్నాయి. దీనిపైనా మేయర్ భాగ్యలక్ష్మి ఘాటుగా స్పందిస్తున్నారు.  విజ‌య‌వాడ అభివృద్ది వేగంగా సాగుతుందని స్పష్టం చేశారు.  విజ‌య‌వాడ ప్ర‌జ‌లకు  సంక్షేమ ప‌ద‌కాలు అమ‌లుకు రూ. 590కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. అభివృద్ధి పనుల్లో శంఖు స్దాప‌న‌లు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా, ప్రారంభోత్స‌వాలు కూడ చేస్తున్నామ‌ని చెబుతున్నారు. 


పలు పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ అంశంపైనా మేయర్ స్పందించారు. టెండ‌ర్లు కు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావాలన్నారు. ‌న‌ర‌ల్ ఫండ్ కింద విడుదల అయ్యే నిధులతో  ప‌ని చేయ‌టానికి ఇబ్బంది ఎంటని ప్రశ్నించారు.  ఎదుగుతున్న వారిని ఓర్వ‌లేక‌...ప్ర‌చారాలు చేసుకొని బ‌తికేస్తున్నారని విపక్ష నేతలపై మండి పడ్డారు.