అన్వేషించండి

YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల

Andhra Pradesh Politics | సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మోదీ చెప్పినట్లు ఈసీ పనిచేస్తుందని ఆరోపించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • APCC చీఫ్ షర్మిల సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్‌తో నిరసన.
  • ప్రధాని మోడీ ప్రజాస్వామ్య హంతకుడంటూ, ఓట్ల చోరీపై తీవ్ర ఆరోపణలు.
  • సీఈసీ నియామక చట్టం, ఓటర్ల ఫారాల దుర్వినియోగంపై షర్మిల విమర్శలు.
  • విజయవాడలో దసరా, ఉత్సవాలతో భారీ ట్రాఫిక్, అంబులెన్స్ నిలిచిపోయింది.

విజయవాడ: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బద్ధమైన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ పౌరులకు ఓటు అనేది ఓ వజ్రాయుధం వంటిదని, కానీ కేంద్ర ప్రభుత్వం ఓట్లు చోరీ చేస్తుందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల ఓట్లను తొలగిస్తుంటే ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేయవద్దా అని ఆమె ప్రశ్నించారు.

‘నన్ను హౌజ్ అరెస్ట్ చేయించడం సీఎం చంద్రబాబుకి న్యాయమా?. శాంతియుతంగా రాజ్ భవన్ కి వెళ్లాలనుకున్నాం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు ఉండాలి. కానీ బీజేపీ ప్రభుత్వం ఓటు హక్కును తొలగిస్తుంది. పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తూ పథకం ప్రకారం బీజేపీ కుట్ర చేస్తుంది. మోదీ చెప్పినట్లుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని’ ఆరోపించారు.

YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
ఛలో లోక్‌సభన్‌లో పాల్గొనకుండా తనను అడ్డుకోవడాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓట్ చోరీ అని ప్లకార్డులు ప్రదర్శించి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ప్రజలకు ఓట్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తూ, దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ప్రధాని తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారని షర్మిల ఆరోపించారు.  మోదీ అంటే మర్డరర్ ఆఫ్ డెమొక్రటిక్ ఇండియా అని మండిపడ్డారు. 

సీఈసీ నియామక ప్రక్రియ నుంచి ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)లకు ఎలాంటి పాత్ర లేకుండా చట్టాన్ని సవరించి, ఈ నియామకాలకు తెరలేపారని ఆమె విమర్శించారు. తోటి ఎన్నికల కమిషనర్లకు కూడా తెలియకుండా 14 సార్లు సీఈసీ ఏకపక్షంగా ఆర్డర్లు పాస్ చేశారని ఆరోపించారు.

ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6, ఫారం 7లను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఓటును ఎవరో ఒకరు తొలగించాలని అభ్యర్థన చేసినప్పుడు మాత్రమే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ఆ బాధ ఏంటో అర్థమవుతుందన్నారు. ఏపీ కాంగ్రెస్ నాయకులు, ప్రజా సంఘాలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తుంటే పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడం అత్యంత దారుణమని కూటమి ప్రభుత్వంపై, పోలీసులపై ఆమె మండిపడ్డారు.

ఇంద్రకీలాద్రి పరిసరాల్లో రద్దీ

విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రానున్న ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటం, దీనికి తోడు 'విజయవాడ ఉత్సవ్', క్రికెట్ మ్యాచ్‌ల సందడి తోడవ్వడంతో బెజవాడ సిటీలో జనాల రద్దీ పెరిగింది. 

ఈ రద్దీ కారణంగా రథం సెంటర్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఓ అంబులెన్స్ కూడా ట్రాఫిక్ మధ్యలోనే చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, పెషెంట్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్‌తో గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, మరోవైపు భానుడి ప్రతాపంతో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. 

Frequently Asked Questions

షర్మిలారెడ్డి ఎవరి రాజీనామాను డిమాండ్ చేశారు?

ఏపీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిలారెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సీఈసీ రాజీనామాకు షర్మిలారెడ్డి ప్రధాన కారణం ఏమిటి?

కేంద్ర ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బద్ధమైన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని షర్మిలారెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల ఓట్లను తొలగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

విజయవాడలో ట్రాఫిక్ రద్దీకి కారణాలు ఏమిటి?

దసరా శరన్నవరాత్రులు, 'విజయవాడ ఉత్సవ్', క్రికెట్ మ్యాచ్‌ల కారణంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పరిసరాల్లో రద్దీ పెరిగింది. దీనివల్ల రథం సెంటర్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడులు ! నారా లోకేష్ తో కంపెనీ ప్రెసిడెంట్ భేటీ
ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడులు ! నారా లోకేష్ తో కంపెనీ ప్రెసిడెంట్ భేటీ
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Embed widget