Andhra Pradesh Holidays In 2025: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు కలుపుకొని మొత్తంగా 23 రోజులు సెలవులు ఉన్నట్టు లిస్ట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సెలవుల్లో నాలుగు రోజులు ఆదివారం సెలవులు తగ్గుముఖ పట్టాయి. 

2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి అధికారిక సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. 2025లో మొత్తం 23 సెలవు దినాలుగా పేర్కొంది ప్రభుత్వం. అయితే ఇందులో నాలుగు హాలిడేలు ఆదివారం వచ్చాయి. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం వచ్చాయి. అందుకే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో కేవలం 19 మాత్రమే ఉద్యోగులకు లభిస్తాయి. 

అక్టోబర్ 2 గాంధీజయంతి, విజయదశమి రెండు సెలవులు కూడా కలిసిపోయాయి. వీటితోపాటు 21 ఆప్షనల్ హాలిడేలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ముందస్తు సమాచారంతో ఐదు సెలవుల దినాలను అధికారులు వాడుకోవచ్చు. ఇందులో కూడా ఈద్-ఈ- గదర్, మహలాయ అమావాస్య ఆదివారం వస్తున్నాయి. మే నవంబర్‌లో ఎలాంటి సెలవులు లేకపోగా... జనవరి ఏప్రిల్‌, ఆగస్టులో ఎక్కువగా నాలుగు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా ఏడాదిలో పది నెలల్లో సెలవులు ఉన్నాయి రెండు నెలల్లోనే ఎలాంటి సెలవులు లేవు. 

మరోవైపు బ్యాంకు ఉద్యోగులు, పోలీస్‌ల శాఖ సిబ్బంది లాంటి ఇతర ఉద్యోగులు వ్యాపార సంస్థలకు నెగోషబుల్ ఇన్స్ట్రుమెం ట్ యాక్ట్ ద్వారా 20 సాధారణ సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్ నబీతోపాటు ఇతర హిందూ పర్వదినాల్లో ఇచ్చే సెలవులను ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సెలవులు ప్రకటిస్తూ ఉంటారు.  

 సాధారణ సెలవుల పూర్తి లిస్ట్ ఇక్క చూడొచ్చు:-

పండగ పేరు   తేదీ   వారం 
భోగి జనవరి 13  సోమవారం
మకర సంక్రాంతి జనవరి 14  మంగళవారం
కనుమ జనవరి 15 బుధవారం
రిపబ్లిక్‌ డే  జనవరి 26  ఆదివారం
మహాశివరాత్రి ఫిబ్రవరి 26  బుధవారం
హోలీ మార్చి 14  శుక్రవారం
ఉగాది మార్చి 30  ఆదివారం
రంజాన్ మార్చి 31  సోమవారం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5  శనివారం
శ్రీరామనవమి ఏప్రిల్ 6  ఆదివారం
బీఆర్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14  సోమవారం
గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18  శుక్రవారం
బక్రీద్ జూన్ 7  శనివారం
మొహర్రం జులై 6  ఆదివారం
వరలక్ష్మీవ్రతం ఆగస్టు 8  శుక్రవారం
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15  శుక్రవారం
శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 16  శనివారం
వినాయకచవితి ఆగస్టు 27  బుధవారం
మిలాద్ ఉన్నబీ సెప్టెంబరు 5  శుక్రవారం
దుర్గాష్టమి సెప్టెంబరు 30  మంగళవారం
విజయదశమి అక్టోబరు 2  గురువారం
గాంధీ జయంతి అక్టోబరు 2  గురువారం
దీపావళి అక్టోబరు 20  సోమవారం
క్రిస్మస్ డిసెంబరు 25 గురువారం

 

పండగ పేరు  సెలవు తేదీ  సెలవు వారం 
న్యూఇయర్‌ జనవరి 1  బుధవారం
హజరత్ అలీ జయంతి జనవరి 13  సోమవారం
షబ్-ఎ-మేరాజ్ జనవరి 27  సోమవారం
షబే-ఎ-బరాత్ ఫిబ్రవరి 14  శుక్రవారం
షహదత్ ఎ హజరత్ అలీ మార్చి 22  శనివారం
షబే-ఎ-కద్ర్ మార్చి 27  గురువారం
జుమ్మతుల్ విదా మార్చి 28  శుక్రవారం
మహావీర్ జయంతి ఏప్రిల్ 10 గురువారం
బసవ జయంతి ఏప్రిల్ 30  బుధవారం
బుద్ధ పూర్ణిమ
మే 12 
సోమవారం
ఈద్-ఎ-గదిర్ జూన్ 15 ఆదివారం
రథయాత్ర జూన్ 27  శుక్రవారం
మొహర్రం(1947 హిజ్రీ) జులై 5  శనివారం
పార్సీ నూతన సంవత్సరం ఆగస్టు 15  శుక్రవారం
మహాలయ అమావాస్య సెప్టెంబరు 21  ఆదివారం
యాజ్ దహుమ్ షరీఫ్ అక్టోబరు 9 గురువారం
కార్తిక పూర్ణిమ నవంబరు 11  బుధవారం
గురునానక్ జయంతి నవంబరు 11  బుధవారం
క్రిస్మస్ ఈవ్ డిసెంబరు 24  బుధవారం
బాక్సింగ్ డే డిసెంబరు 26  శుక్రవారం

Also Read: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత