బెజవాడలో ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవం సందర్బంగా ప్రకటించిన బంపర్ ఆఫర్ కు జనం బారులు తీరారు. కేవలం 5 పైసలకే ఫుల్ మీల్స్ వడ్డిస్తామని ప్రకటన చేశారు. దీంతో పాతకాలం నాటి 5 పైసల నాణాలను తీసుకొని చాలా మంది హోటల్ ముందు వాలిపోయారు. అయితే మొదటి 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ అని చెప్పటంతో చాలా మంది నిరుత్సాహపడ్డారు.
హోటల్ ప్రారంభోత్సవానికి పబ్లిసిటీ
విజయవాడ నగరంలోని మొగల్ రాజపురంలో కొత్తగా ఓ ప్రైవేట్ హోటల్ ను ప్రారంభించారు. అయితే అన్ని హోటల్ ల తరహాలోనే తమ హోటల్ కూడా ఉంటుంది కాబట్టి జనం అంతగా అట్రాక్ట్ కారని భావించిన యాజమాన్యం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించింది. పాతకాలం నాటి 5 పైసల నాణేలు తెస్తే భోజనం వడ్డిస్తామని తెలిపింది. భోజనం అంటే అలాంటి ఇలాంటి భోజనం కాదు, పది రకాల కూరలు, రెండు రకాల సాంబార్, రసం పాటుగా ఆఖర్లో ఐస్ క్రీమ్ వడ్డించారు. దీంతో జనం హోటల్ ముందు బారులు తీరారు. యాజమాన్యం ప్రకటనతో ఎక్కడా లేని ఆదరణ వచ్చేసింది.హోటల్ కు జనం ఎగబడటంతో ఇలా అయితే కష్టం అని భావించి ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చింది హోటల్ యాజమాన్యం.
కేవలం 50 మందికి మాత్రమే
ఊహించని విధంగా హోటల్ ప్రారంభోత్సవానితి జనం ఎగబడటంతో యాజమాన్యం చివరకు చేతులు ఎత్తేసింది. మొదట వచ్చిన 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు. దీంతో చాలా మంది నిరాశగా వెనుతిరాగారు. అయితే కొంత మంది మాత్రం ఎలాగూ వచ్చాం కాబట్టి ఏదోకటి తిందామనుకొని, అక్కడే లాగించేశారు. అయితే 50 మందికి 5 పైసలకే భోజనం వడ్డించిన యాజమాన్యం ఆ తరువాడ డబ్బులు కట్టి భోజనం చేసిన వారి నుంచి 401 రూపాయలు వసూలు చేశారంట. అయితే చిల్లర సమస్య కారణంగా చాలా మంది కేవలం 400 రూపాయలే ఇచ్చారని యాజమాన్యం వెల్లడించటటం మరో ట్విస్ట్.
ఇంతకీ 5 పైసల కథ ఏంటి?
హోటల్ యాజమాన్యం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి, ఇలాంటి క్రేజి ప్రచారం చేసింది. ఊహించని విధంగా జనం కూడా వచ్చారు. అయితే కేవలం 5 పైసలకే భోజనం వడ్డించటం ఎలా అని మాత్రం ఎవ్వరూ అడగలేదు. ఒకరిద్దరికి మాత్రం ఈ సందేహం వచ్చిందట. ఎందుకు 5పైసలు అది కూడా చెల్లదు. దానికి బదులు ఫ్రీ అనవచ్చుగా అంటే, అక్కడే మరో కిక్ ఉందని యాజమాన్యం వెల్లడించింది. తమకు 5 నెంబర్ పై నమ్మకం ఉందని, ఫ్యాన్సీగా తాము వీటికి ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు.
కేవలం మౌత్ పబ్లిసిటీ
అయితే ఇదంతా కేవలం మౌత్ పబ్లిసిటీతో జరిగిందని యాజమాన్యం అంటుంది. నగరంలో అనేక హోటళ్లు ఉన్నప్పటికీ తమకంటూ ప్రత్యేకత కావాలనే ఆలోచన చేసి పోస్టర్లు వేశామని, వాటిని ఆధారంగా చేసుకొని జనం ఒకరికి ఒకరు మాట్లాడుకోవటం ద్వారానే ఇంత మంది జనం రావటానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఇదొక ట్రెండ్
వాస్తవానికి వ్యాపారంలో అనేక టెక్నిక్స్ ఉంటాయి. చాలా మంది ఫుడ్ కు ఇచ్చే ప్రయార్టీతో ఆ రంగంలో ఉన్న వారు,సెలబ్రిటీలకు ,ప్లేయర్స్ కు ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసి వారిని ప్రకటనల కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ వ్యాపారానికి పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ లాభం పొందటం కూడా ఒక ఆర్ట్..అందులో ఇలాంటి పబ్లిసిటి స్టంట్ లు బాగా పని చేస్తాయనేందుకు ఈ హోటల్ ఘటన ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.