Vande Bharat Express: భారత్ రైల్వే చరిత్రలోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ చాలా ప్రత్యేకమైంది. అతి తక్కవ కాలంలోనే గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇప్పుడు ఈ ట్రైన్ బాగా పనికొస్తుంది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీసింది వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ఇప్పుడు మరో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ఈ రైలు నడపనున్నట్టు ఇదివరకు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ రైలును వెంకటేశ్వర స్వామి భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే ఈ ట్రైన్ ఈ రెండు సిటీల మధ్య దూసుళ్లనుంది. దీనికి సరైన ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక రైల్వే అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సందేశం వచ్చింది. గురువారం రోజు రాత్రి అన్ని విభాగాలను ఆదింశించారట. వచ్చే నెల మొదటి వారంలోనే దీన్ని తిరుపతి, హైదరాబాద్ మధ్య నడపాలని భావిస్తున్నారని సమాచారం.
వారంలో ఆరు రోజుల మాత్రమే ఈ ట్రైన్ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన రూట్, ఏ స్టేషన్లలో ఆగుతుంది... టికెట్ ఎంత అనే వివరాాలను వచ్చే వారంలో ప్రకటించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ నుంచి వేల మంది తిరుపతి స్వామివారిని దర్శించుకుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండే హైదరాబాద్ నుంచి రోజు వేల మంది తిరుపతి దర్శనానికి వెళ్తుంటారు.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దేవుని దర్శనాని కంటే ముందు ప్రయాణమే పెద్ద అగ్ని పరీక్షలా ఉంటుంది. టికెట్ బుకింగ్ నుంచే వారి సహనానికి పరీక్ష మొదలవుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుంటే మాత్రం తిరుపతికి టికెట్ దొరకడం చాలా సమస్య అందుకే ఇప్పుడు వందేభారత్ రాకతో ఆ సమస్య తీరిపోనుందని నగరవాసులు అంచనా వేసుకుంటున్నారు. ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్ నగర్-కర్నూల్, వికారాబాద్-తాండూర్-రాయచూర్.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూర్ మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఏయే స్టేషన్లలో ఈ వందేభారత్ రైలు ఆగుతుంది, ఛార్జీలు ఎంత, ఇక్కడి నుంచి తిరుపతి చేరడానికి ఎంత సమయం పడుతుంది వంటి వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదాన్ని తిరుపతిలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ కు ధరలివే..!
టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ అనేవి ఉన్నాయి. అయితే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. చైర్ కార్, ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్ నడుస్తున్న షెడ్యూల్‌ను బట్టి అందించే ఫుడ్‌లో మార్పులు ఉంటాయి. ఉదాహరణకు ఉదయం ఇచ్చే ఫుడ్ వేరు. రాత్రి ఇచ్చే ఆహారం వేరు. అందుకే టికెట్ ధరల్లో తేడా కనిపిస్తోంది.
* సికింద్రాబాద్ - విశాఖపట్నం (SC - VSKP) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20834
నుండి వరకు ఛార్జీ (చైర్ కార్) ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
సికింద్రాబాద్ వరంగల్ రూ.520 రూ.1,005
సికింద్రాబాద్ ఖమ్మం రూ.750 రూ.1,460
సికింద్రాబాద్ విజయవాడ రూ.905 రూ.1,775
సికింద్రాబాద్ రాజమహేంద్రవరం రూ.1365 రూ.2,485
సికింద్రాబాద్ విశాఖపట్నం రూ.1665 రూ.3,120
* విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ (VSKP - SC) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833
నుండి వరకు ఛార్జీ (చైర్ కార్) ఛార్జీ (ఎగ్జిక్యుటివ్ చైర్ కార్)
విశాఖపట్నం రాజమహేంద్రవరం రూ.625 రూ.1,215
విశాఖపట్నం విజయవాడ రూ.960 రూ.1,825
విశాఖపట్నం ఖమ్మం రూ.1,115 రూ.2,130
విశాఖపట్నం వరంగల్ రూ.1,310 రూ.2,540
విశాఖపట్నం సికింద్రాబాద్ రూ.1720 రూ.3,170