Vallabhaneni Vamsi:  వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  పోలీసు కస్టడీలో జగన్ పేరు చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి.. కేస్ విత్ డ్రా చేయించిన తర్వాత వల్లభనేని వంశీ తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఒక రోజు అంతా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట వంశీ తాను తాడేపల్లికి వెళ్లలేదని వాదించిన గుగుల్ టేకవుట్ తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలు చూపించి అడగడంతో తాను తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లినట్లుగా అంగీకరించారు. అక్కడ ఎవరితో సమావేశమయ్యారన్నదానిపై మాత్రం వివరాలు చెప్పలేదని అంటున్నారు. జగన్ కు కిడ్నాప్ కేసు గురించి తెలియదని.. తాను ఆయనను కలవలేదని.. కిడ్నాప్ గురించి  చెప్పలేదని పోలీసులుక ఆనయ వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే వంశీ ఈ కేసులో ఫిర్యాదు దారుడ్ని బెదిరించాడనికి,కడ్నాప్ చేయడానికి ప్లాన్ మొత్తం ఇతరులు సిద్ధం చేశారని దాన్ని వంశీ పాటించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాడేపల్లికి వెళ్లి ఓ రోజంతా ఉండటంతో  జగన్ ప్రమేయం ప్రచారం లోకి వచ్చింది. 

పోలీసు కస్టడీలో వల్లభనేని వంశీ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సత్యవర్ధను తన ఇంటికి తీసుకెళ్లడం, విశాఖలోని తన అనుచరులతో ఓ ఇంట్లో బంధించడం వంటి వాటిని సాంకేతిక ఆధారాలతో ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. తన ఇంటికి సత్యవర్ధన్ వచ్చాడని ఓ రాత్రి ఉన్నాడని అయితే అతను సత్యవర్ధన్  అవునో కాదో తనకు తెలియదని వంశీ చెప్పినట్లుగా తెలుస్తోంది. తన ఇంటికి ఎవరు వస్తున్నారో కూడా తెలియనంతగా వంశీ ఉంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఆయన నివాసం ఉన్న మైహోం భూాజా అపార్టుమెంట్ లోకి ఇతరుల్ని రానివ్వరు. ఆ ఫ్లాట్ లో ఉన్న వారి అనుమతి మేరకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికో ప్రాసెస్ ఉంటుంది. వంశీ అనుమతి మేరకే సత్యవర్ధన్ ను లోపలికి పంపించి ఉంటారు.. మరి ఎందుకు తెలియదని చెప్పారన్నది పోలీసులు రికార్డు చేసుకునే అవకాశం ఉంది. 

ఇలాగే సత్యవర్ధన్ ను విశాఖలో ఓ దుకాణానికి తీసుకెళ్లి దుస్తులు కొనిచ్చారు. ఆయన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసింది. ఆయనను కిడ్నాప్ చేయలేదని స్వచ్చగా దుస్తులు కొనుక్కుంటున్నారని ప్రకటించింది. అయితే ఆయనకు రెండు వైపులా వంశీ అనుచరులు అయిన రౌడీషీటర్లు ఉన్నారు. అంటే వారి అదుపులోనే సత్యవర్ధన్ ఉన్నారని పోలీసులకు స్ఫష్టత వచ్చిందని చెబుతున్నారు. మూడు రోజుల కస్టడీలో చాలా విషయాలకు వంశీ..తెలియదు..గుర్తు లేదు అనే మాధానాన్నే చెప్పినట్లుగా తెలుస్తోంది. 

సాధారణంగా బెయిల్ వచ్చేటప్పుడు ఫిర్యాదుదారుడ్ని, సాక్ష్లుల్ని బెదిరించకూడదని షరతులు పెడతారు. ఇక్కడ వంశీ నేరుగా ఫిర్యాదు దారాడ్నే కిడ్నాప్ చేసినట్లుగా కేసు పెట్టడంతో ఆయనకు బ ెయి రావడం కూడా కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులోనూ ఆయనకు హైోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇంకా గన్నవరంలో ఆయన చేసిన పలు నేరాలపై కేసులు కూడా వెలికి తీస్తున్నట్లుగా తెలుస్తోంది.