Bail For Vallabhaneni Vamsi: వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు ఈ బెయిల్ లభించింది. ఈ కేసులోనే మొదటగా వంశీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు ఇటీవలే న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఈ ఒక్క కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇతర కేసుల్లో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

ఇటీవలే చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు                    

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టు చేసి మూడు నెలలు కావడంతో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే   వంశీ తన అనుచరులోత కలిసి సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారని దర్యాప్తులో తేలిందని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.  తాము చెప్పినట్లు వినకపోతే  సత్యవర్థన్ తో పాటు ఆయన  కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి  అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలిందన్నారు.  

సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి.. కేసు ఉపసంహరించేలా అఫిడవిట్ పై సంతకాలు              విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారివీధి నుంచే సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి, భయపెట్టారు.  కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్‌పై సంతకాలు చేయించుకున్నారని తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు.  కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబసభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారు.              

సీసీ ఫుటేజీలతో సాక్ష్యాలు                                 

సత్యవర్ధన్‌ను ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్‌లోని మై హోమ్‌ భూజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారు.  ఆ రాత్రంతా సత్యవర్ధన్‌ను చిత్రహింసలు పెట్టారు. తర్వాత  పొట్టి రాము, వేల్పూరి వంశీ, ఎం.వేణులు ఏపీ 40బీజీ 5005 నంబరు క్రెటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారు.  12న అక్కడ హోటల్‌ చందనలో సత్యవర్ధన్‌ను నిర్బంధించారు. తర్వాత  చేబ్రోలు శ్రీనివాస్‌ ఇంట్లో ఉంచారు.  తేలప్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని సత్యవర్ధన్‌ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారని చార్జిషీట్‌లో పోలీసులు చెప్పారు. సాక్ష్యాలుగా సత్యవర్ధన్ ను తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజీలను, ఇతర ఆధారాలను సమర్పించారు.         

ఆరోగ్యం బాగోలేదని చెప్పిన వంశీ   

అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కోర్టుకు వంశీ చెప్పారు.  చార్జి,షీటు దాఖలు చేయడంతో పాటు .. అరెస్టు చేసి మూడు నెలలు అయినందున  ఆయనకు బెయిల్ మంజూరు అయింది.