ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ( PM Modi ) పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (  Undavalli Arun Kumar )  మరోసారి మండిపడ్డారు. రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్ిటన ఆయన తాను న్యాయపోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2013లోనే విభజనపై సుప్రీంకోర్టులో ( Supreme Court ) పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అల్లంకి రమేష్ ద్వారా అర్జెంట్ హియరింగ్ పిటీషన్ దాఖలు చేశానన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి చేతులు జోడించి వేడుకున్నారు. 


రెండు గంటల్లో యాభై వేల మందికి భోజనం రెడీ - అక్షయపాత్రను ప్రారంభించిన సీఎం జగన్ !


ఏపీ విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రదాని మోదీ, అమిత్ షాలు పార్లమెంట్ ఉభయ సభల్లోనే ( Parlament ) చెప్పారని ఉండవల్లి గుర్తుచేశారు. విభజనపై ఇప్పటికైనా ఏపీకి సంబంధించిన నేతలు స్పందించాలన్నారు.  2018లో మోదీ చేసిన వ్యాఖ్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ( Chandrababu ) కలిసి చర్చించినట్లు తెలిపారు. దీనిపై చర్చ జరగాలని కోరాలని సూచించానని.. గుర్తుచేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. దీనిపై లేఖ రాసినట్లు అరుణ్ కుమార్ ( Arun Kumar )  పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు స్పందించలేదని మీరైనా దీనిగురించి పార్లమెంట్‌లో మాట్లాడాలని సీఎం జగన్‌కు ( CM Jagan  ) గుర్తుచేశానన్నారు. ముఖ్యమంత్రి స్పందించి ఒక మెయిల్ ఏర్పాటు చేసి ఏపీ విభజనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు, జగన్‌లు కొట్టుకొని ఏపీకి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం అన్యాయమని విమర్శించారు. 


నారావారి పల్లెలో భూ కబ్జా - చంద్రబాబు కుటుంబం భూమికి ఆక్రమణదారుల ఫెన్సింగ్ !


ఆంధ్రప్రదేశ్‌కు ( Andhra Pradesh )  జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఏపీ విభజన, పోలవరం అంశాలపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ( Telangana CM KCR ) కూడా ఈ అంశంలో స్పందించాలని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీని ( BJP ) నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు. ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరిగిందని కేసీఆర్ ఒప్పుకుంటారా అని  ప్రశ్నించారు.