NDDB report:  తిరుమల శ్రీవారి లడ్డూ కేసు విషయంలో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్ ను ఉపయోగించి వైసీపీ హయాంలో లడ్డూను తయారు చేశారని ఆరోపించారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే తాను మాట్లాడుతున్నానన్నారు. కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.  వైసీపీ హయాంలోఐదేళ్లు ఆలయాలన్నింటిలోనూ కల్తీ నెయ్యినే ఉపయోగించి  ప్రసాదాలు తయారు చేశారన్నారు. శ్రీశైలంలోనూ కల్తీ జరిగినట్లుగా తేలిందని చెప్పారు. కర్నూలు జిల్లాలో రైతులకు పాస్‌బుక్‌లు ఇచ్చే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.   

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు ' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ  సంచలన వ్యాఖ్యలు చేశారు.  గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిని  బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్"** తో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అపరిశుభ్రమైన పద్ధతుల్లో, రసాయనాలు కలిపి తయారు చేసిన ఆ కల్తీ నెయ్యిని వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. తాను చేస్తున్న ఈ ఆరోపణలు గాలిలో చేస్తున్నవి కావని,  NDDB  నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్  నివేదిక ఆధారంగానే ఈ విషయాలు చెబుతున్నానని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తాను ఎప్పుడూ మాట్లాడనని ఆయన  స్పష్టం చేశారు.  

కేవలం తిరుమల మాత్రమే కాకుండా, శ్రీశైలం క్షేత్రంలోనూ ప్రసాదాల తయారీలో గత ప్రభుత్వం కల్తీ నెయ్యిని వాడిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటినీ గత ఐదేళ్లలో అపవిత్రం చేశారని అసహనం వ్యక్తం చేశారు.  లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ  సిట్  క్లీన్ చిట్ ఇచ్చాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. సిట్ తన నివేదికలో కల్తీ జరిగినట్లు స్పష్టంగా పేర్కొందని, వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నేతలు మనుషులతోనే కాదు, దేవుడితో కూడా పెట్టుకున్నారని.. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసిన ఈ మహా పాపం  ఊరికే పోదని, దోషులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.

కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేస్తే దానిని సరిదిద్దే ప్రయత్నం చేశానని చంద్రబాబు తెలిపారు.  గతంలో లడ్డూకి, ఇప్పుడు అందించే లడ్డూకు చాలా వ్యత్యాసం ఉంది.   పరామర్శల పేరుతో గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు పట్టేలా వ్యవహరించారు. మరే వాహనాలు వెళ్లకుండా వాహనదారులను ఇబ్బందులు పెట్టారు  గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించేశారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలను కిందపడేసి తొక్కించేసి రౌడీయిజం చేశారు. బలప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలి.  ప్రజా సమస్యల కోసం పోరాడకుండా రాజకీయం కోసమే బలప్రదర్శన చేస్తున్నారు. ఈ తరహా రాజకీయాన్ని ఎదుర్కోవటం తనకు తెలుసని చంద్రబాబు అన్నారు.