TTD Board Member MS Raju: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు, మడకశిర TDP ఎమ్మెల్యే మీ.ఎస్.రాజు 'భగవద్గీత', 'బైబిల్', 'ఖురాన్' వంటి మత గ్రంథాలు రాజ్యాంగం కన్నా గొప్పవేం కాదని అన్నారు. మత గ్రంథాలు దళితుల జీవితాల్లో మార్పు తీసుకురాలేదని, డా.బీ.ఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం వల్లే దళితుల బతుకులు మారాయని రాజు .. కార్యక్రమంలో చెప్పారు. "భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి మత గ్రంథాలు దళితుల బతుకులు మార్చలేదు. కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దళితుల తలరాతలు మారాయి. మత గ్రంథాలు కాదు, రాజ్యాంగం మాత్రమే మా జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది." అని ప్రసంగించారు.
మూడు మత గ్రంధాల గురించి ఎంఎస్ రాజు చెప్పినప్పటికీ టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండి.. భగద్గీత జీవితాల్లో మార్పు తీసుకురాదని చెప్పడంపై హిందూ సంస్థలు, రాజకీయ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా రాజును తీవ్రంగా ఆరోపించి, 'క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే వివాదం రగిలింది. హిందూ సంస్థలు దీన్ని 'సనాతన ధర్మానికి అవమానం'గా చూస్తూ, రాజు TDP నుంచి బహిష్కరణ, TTD బోర్డు నుంచి తొలగింపు డిమాండ్ చేశాయి.
ఈ వివాదంపై ఎంఎస్ రాజు ప్రతిస్పందించారు. తాను దళిత హిందువునని భూమన కరుణాకర్ రెడ్డిలా కాదన్నారు. నా కుటుంబం మొత్తం హిందూ. భగవద్గీత లేదా ఇతర మత గ్రంథాలను అవమానించలేదు. అంబేద్కర్ రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రశంసించానన్నారు. మోంథా తుపాను రిలీఫ్‌పై ప్రభుత్వం చేస్తున్న పనులను డైవర్ట్ చేయడానికి తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. హిందవుల మనోభావాలు గాయపడితే..ఒక హిందువుగా క్షమాపణలు చెబుతాను." అని ప్రకటించారు.
"రాష్ట్రంలో 5,000 ఆలయాలు నిర్మించాలని ప్రతిపాదించాను, మడకశిరలో ఆలయ కార్యక్రమాలు నిర్వహించాను" అని ఎంఎస్ రాజు గుర్తు చేశారు. ఎంఎస్ రాజు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసినట్లయింది.