By: ABP Desam | Updated at : 30 Jun 2023 03:00 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు - ముగిసిన సుప్రీం ఇచ్చిన దర్యాప్తు గడువు !
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. జులై 14 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణ సందర్భంగా కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 30వతేదీతో ముగుస్తోంది. గతంలో సుప్రీంకోర్టు జూన్ 30లోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సీబీఐని ఆదేశించింది. పూర్తి వివరాలు
నాపై పోటీకి పెట్టే ఖర్చు రూ. 150కోట్లు- టీడీపీ అభ్యర్థి నారాయణపై అనిల్ సీరియస్ కామెంట్స్
నెల్లూరు ఫైట్ ఎవరెవరి మధ్యో తేలిపోయింది. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా నారాయణ పేరు ఖరారైంది. దీంతో వెంటనే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ స్పందించారు. నారాయణపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన పక్కా బిజినెస్ మేన్ అని, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోరాన్నారు. ఓడిపోయిన తర్వాత నాలుగున్నరేళ్లు ఇప్పుడు ఆయన తిరిగి పోటీ కోసం నెల్లూరుకి రావడమేంటని ప్రశ్నించారు అనిల్. నెల్లూరు సిటీకి మాజీ మంత్రి నారాయణను అభ్యర్థిగా టీడీపీ ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ ప్రకటన వచ్చీ రాగానే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ ప్రెస్ మీట్ పెట్టారు. నాలుగున్నరేళ్లు నెల్లూరు సిటీకి దూరంగా ఉన్న నారాయణ తనపై పోటీ కోసం 150కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని అన్నారు అనిల్. పూర్తి వివరాలు
మరోసారి తెలంగాణ పర్యటనకు మోదీ - ఈ సారి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా ?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఎప్పుడు ఖరారైనా అందరికీ ముందుగా వచ్చే సందేహం ఒక్కటే. ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా లేదా అనే. అయితే గత కొంత కాలంగా కేసీఆర్.. ప్రధాని మోదీకి ఆహ్వానం పలకడం లేదు. ఢిల్లీలో సమావేశం అయ్యేందుకు కూడా ప్రయత్నించడం లేదు. అయితే అప్పట్లో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించి ఉన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటి యుద్ధ వాతావరణం లేదు. కేసీఆరే వెనక్కి తగ్గి తేలిక పాటి వాతావరణాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ స్వాగతం చెబుతారా ? పూర్తి వివరాలు
కన్నార్పకుండా అబద్దాలు చెప్పగలిగే వ్యక్తి- సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాల్సి అవసరం ఉందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సివి నాయుడు పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడుకు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 6 నియోజకవర్గాల్లో ఉన్న తన అనుచరులతో కలసి ఎస్‌సివి నాయుడు పార్టీలో చేరారు. పూర్తి వివరాలు
మార్కెట్లో జనసేన బ్రాండ్ సైకిల్స్ - భీమవరంలో యువత హల్ చల్ !
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నా ఆయనకు ఫాలోయింగ్ తగ్గడం లేదు. ఇంకా పెరుగుతోంది. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం కాదు.. స్వయంగా జనసేన ను బ్రాండ్ గా మార్చడానికి కొంత మంది యువత తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరంలో ఓ సంస్థ జనసేన బ్రాండ్ మీద సైకిళ్లను తయారు చేస్తోంది. జనసేన రంగులు, స్టిక్కర్లతో చూస్తేనే జనసేన రంగులు గుర్తు వచ్చేలా మార్కెట్లో ప్రవేశ పెట్టింది. పవన్‌కల్యాణ్ మూడు రోజులుగా భీమవరంలో బస చేశారు. దీంతో భీమవరంలో కొందరు యువత ఈ సైకిళ్లపై ర్యాలీ నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. పూర్తి వివరాలు
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ, జైల్లో చంద్రబాబుతో చర్చలు
Nagababu Meeting: టీడీపీతో పొత్తు తర్వాత రంగంలోకి నాగబాబు, ఆ జిల్లాపై కన్నేసిన జనసేన
Sidharth Luthra : సిద్ధార్థ లూధ్రా మరో ఆసక్తికర ట్వీట్ - ఈ సారి ఏం చెప్పారంటే ?
Ganja in AP: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన 350 కిలోల గంజాయి - సప్లై చేసేది ఎవరో తెలిస్తే షాక్!
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
/body>