News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top Headlines Today: ఏపీ పంచాయతీ ఉపఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తత! ఆమరణదీక్షతో క్షీణించిన బీజేపీ నేత ఆరోగ్యం !

Top 5 Telugu Headlines Today 19 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

FOLLOW US: 
Share:

Top 5 Telugu Headlines Today 19 August 2023: 
అమెరికా నుంచి విద్యార్థులను ఎందుకు పంపించారో తెలుసుకోండి- అధికారులకు సీఎం ఆదేశం
ఇమిగ్రేషన్ టైంలో చేసిన పొరపాటు కారణంగా కొందరి భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు రిట్నర్ ఫ్లైట్ ఎక్కించి తిప్పి పంపించారు. ఇందులో తెలుగు విద్యా‌ర్థులు కూడా ఉన్నారు. ఇందులో ఏపీకి చెందిన వారు ఉండటంతో ఆ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు అక్కడి అధికారులు ఎందుకు పంపుతున్నారో తెలుసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కారణాలు తెలుసుకొని వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు.  పూర్తి వివరాలు

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఆమరణదీక్ష - మరింత క్షీణించిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం !
 నిర్మల్ నిర్మల్ పట్టణం గుండా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం గంట గంటకు విషమిస్తుండ‌టంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.. గంట గంటకు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు  బిజెపి అగ్ర నాయకులు వివేక్ వెంకటస్వామి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు వచ్చి దీక్షకు సంఘీభావం మద్దతు తెలుపనున్నారు. పూర్తి వివరాలు 

హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌ రెడ్డి కీలక ప్రకటన - వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీలో మొదటి జాబితా సిద్ధమైపోయిందని కూడా టాక్ నడుస్తోంది. ఎక్కువ మంది సిట్టింగ్‌లకే ఛాన్స్ ఇస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఆశావాహులు మాత్రం పట్టు వీడటం లేదు. ఆఖరి నిమిషం వరకు తమకే టికెట్ ఇవ్వాలని అధినాయకత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు నేతలు బహిరంగంగానే తామే పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నారు. అలాంటి నేతల్లో హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఒకరు.  పూర్తి వివరాలు

టీడీపీ వర్సెస్ వైసీపీ - ఏపీ పంచాయతీ ఉపఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తత !
ఏపీలో  35 గ్రామ  సర్పంచ్‌, 245 వార్డు సభ్యుల స్థానాలకు శనివారం పోలింగ్‌ జరిగింది.  మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌   అనంతరం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. చిన్న పంచాయతీల ఉపఎన్నికలే అయినా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పింది.  అనంతపురం జిల్లా నార్పలలో ఎనిమిదవ వార్డు ఉప ఎన్నికలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్లుగా పోరు సాగుతోంది.  ఒక వార్డ్‌ పోలింగుకు డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ అస్సార్‌ భాష, రాప్తాడు, నార్పల ఎస్సైలు, మరో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు

తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టించిన మురళీధర్‌రావు- రాత్రికి వివరణ ఇస్తూ వీడియో రిలీజ్
తెలంగాణ పార్టీ అధ్యక్షుడి మార్పుతో కాస్త వెనుకంజలో ఉన్న బీజేపీకి సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా గుడ్‌ చెబుతున్నారు. దీనికి తోడు ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ నాయకుడు ఒకరు చేసిన కామెంట్స్‌ మరింత ఇబ్బందిలో పడేశాయి. కాసేపటికే జరిగిన డామేజ్‌ను సవరించుకొని వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేదంటోంది కేడర్. కష్టాల్లో ఉన్న బీజేపీలో ఊపు తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఒక్కొక్కరుగా సీనియర్ లీడర్లు వస్తున్నారు. ఇక్కడ కేడర్‌తో సమావేశమవుతూనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేసే ప్రయత్నంలో బీజేపీ సీనియర్ నేతల మురళీధర్‌రావు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు

Published at : 19 Aug 2023 02:56 PM (IST) Tags: BJP YSRCP AP News BRS Telangana News #tdp

ఇవి కూడా చూడండి

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గాలిస్తున్న పోలీసులు

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గాలిస్తున్న పోలీసులు

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ధీమా!

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ధీమా!

Fact Check : సింగపూర్‌లో చంద్రబాబు ఆస్తులు సీజ్ అంటూ ప్రచారం - వైఎస్ఆర్‌సీపీపై టీడీపీ ఆగ్రహం !

Fact Check :  సింగపూర్‌లో చంద్రబాబు ఆస్తులు సీజ్ అంటూ ప్రచారం - వైఎస్ఆర్‌సీపీపై టీడీపీ ఆగ్రహం !

టాప్ స్టోరీస్

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!