By: ABP Desam | Updated at : 12 Sep 2023 02:58 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 12 September 2023:
న్యాయం కోసం పోరాడుతాం- చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారు: బాలకృష్ణ
టీడీపీ అధినేత చంద్రబాబును ఫ్రేమ్ చేయడానికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను సృష్టించారని నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ స్కామ్‌లో ప్రేమ్‌చంద్రారెడ్డి, అజయ్ ఖల్లాం రెడ్డి పేర్లు ఎక్కడ అని నిలదీశారు. చంద్రబాబుపై కక్ష సాధింపుతో ఎలాంటి ఆధారాలు లేకుండా చట్టాలని అతిక్రమించి నేరాన్ని మోపారన్నారు నందమూరి బాలకృష్ణ. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఓ బ్రాండ్... ప్రపంచ దేశాలే ఆయన గురించి చెప్పుకుంటున్నాయన్నారు. ఇప్పుడు పాలన గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నారు. పూర్తి వివరాలు
సీనియర్ రాజకీయనాయకుడు డీ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్స
మాజీ రాజ్యసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...కుటుంబసభ్యులు బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రి చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల నుంచి డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలోనే డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పాటు పక్షవాతం కూడా సోకింది. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో...సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందించడంతో కోలుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని ఎంపీ అరవింద్ తెలిపారు. డీ.శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించామన్నారు. పూర్తి వివరాలు
చంద్రబాబుపై కక్ష సాధింపు కాదు - జైల్లో పూర్తి భద్రత ఉందన్న రోజా
చంద్రబాబుపై కక్ష సాధింపు కాదని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయాడని ఏపి మంత్రి ఆర్.కే.రోజా తెలిపారు.. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి ఆర్కే రోజా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయని, తప్పు చేసే చంద్రబాబుకి శిక్ష పడాలని రాష్ట్ర ప్రజలందరూ భగవంతుడిని ప్రార్థించారని, అందుకే చంద్రబాబు నాయుడు కటకటాల పాలయ్యారని ఆమె విమర్శించారు.. స్నేహ బేరక్ లో చంద్రబాబుకి ప్రత్యేక గదిని, అదేవిధంగా ఖైదీ నెంబర్ 7691 అనే నెంబర్ ని కేటాయించడం జరిగిందన్నారు. పూర్తి వివరాలు
ప్రెస్ మీట్‌తో కొత్త చర్చకు తెరలేపిన బాలకృష్ణ - నేను వస్తున్నా అంటే మరి లోకేష్..?
ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.. నేనొస్తున్నా.. నేనుంటా.. తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దాం ఇది నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ఎండింగ్‌లో చెప్పిన డైలాగులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న తరుణంలో..బాలయ్య చెప్పిన ఈ మాటలు కేవలం కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకేనా..లేదా టీడీపీ నూతన సారథిగా బాలయ్య బాధ్యతలు తీసుకోబోతున్నారా..బాలయ్య ఇచ్చిన అభయం దేనికి సంకేతం అనే ఇప్పుడు ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండు పార్టీల్లోనూ చర్చకు దారి తీస్తోంది. పూర్తి వివరాలు
అసెంబ్లీ టికెట్ల కోసం తెలంగాణ బీజేపీలో తీవ్ర పోటీ- వారంలో 6 వేల అప్లికేషన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు...ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోస్తోంది. కమలం పార్టీ సైతం ఆశావహుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఊహించని విధంగా దరఖాస్తులు వచ్చాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సామాన్య కార్యకర్తలు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లకు ఎలాంటి రుసుం లేకపోవడంతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారం రోజుల్లేనే ఏకంగా 6వేల 11 అప్లికేషన్లు వచ్చాయ్. బీజేపీకి అభ్యర్థులే లేరన్న కామెంట్లకు దరఖాస్తులతో నోరు మూయించింది. పూర్తి వివరాలు
ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!
TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత
AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
/body>