Sathya Sai Baba centenary celebrations: సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రమయానికి ప్రతి రోజూ విమానాలు వస్తున్నాయి. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బీజేపీ అగ్రనేతుల ప్రతి రోజూ వస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు. ఆయనకు సత్యసాయి జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్ రెడ్డి స్వాగతం పలికారు.
ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబాను దర్శించుకున్న తర్వాత దేవంద్ర ఫడ్నవీస్ ఆటోలను పంపిణీ చేశారు. పేదల ఉపాధి కోసం వీటిని విరాళంగా ఇచ్చారు.
శతజయంతి ఉత్సవాల ప్రారంభం రోజున ప్రధాని మోదీ వచ్చారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలు తరలి వస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వచ్చారు.
ఇరవై మూడో తేదీ వరకూ ప్రశాంతి నిలయంలో వేడుకలు జరగనున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున నేతలు తరలి రానున్నారు. ముగింపు వేడుకలుకు ముఖ్యమంత్రి సహా ఇతర ప్రాంతాలకు చెందిన బీీజేపీ నేతలు.. సత్యసాయి భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
