ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ


సుప్రీం తీర్పుతో తేలనున్న రాష్ట్ర రాజధాని భవిష్యత్తు
అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు
ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు విచారణ చేయనున్న త్రిసభ్య ధర్మాసనం
సుప్రీంకోర్టు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి


ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి


విమానంలో సాంకేతిక లోపంతో పర్యటన ఆలస్యం
ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసుకోవడంలో జాప్యం
ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ 2023లో పాల్గొననున్న సీఎం జగన్
రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకట్టుకోవడమే లక్ష్యంగా సమ్మిట్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర 5వ రోజు (31-01-2023) షెడ్యూల్‌
ఉదయం 
     8.00  కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి పాద‌యాత్ర ప్రారంభం 
     10.30 క‌స్తూరి న‌గ‌రం క్రాస్ వ‌ద్ద గౌడ (త‌మిళ్‌) సామాజిక‌వ‌ర్గం వారితో స‌మావేశం
     11.40  కైగ‌ల్లు గ్రామం వ‌ద్ద యాద‌వ సామాజిక‌వ‌ర్గ ప్రతినిధుల‌తో భేటీ
మ‌ధ్యాహ్నం
     12.30  దేవ‌దొడ్డి గ్రామంలో కురుబ‌/కురుమ సామాజిక‌వ‌ర్గం వారితో ముఖాముఖి 


సాయంత్రం
   4.25 బైరెడ్డిప‌ల్లె ప‌ట్టణం రాయ‌ల్ మ‌హ‌ల్ లో బీసీ క‌మ్యూనిటీ స‌మావేశం
   5.15 బైరెడ్డిప‌ల్లె ప‌ట్టణంలో తెలుగుదేశం జెండా ఆవిష్కర‌ణ 


రాత్రి 
6.55 క‌మ్మన‌ప‌ల్లె స‌మీపంలోని క‌స్తూరిబా స్కూల్ విడిది కేంద్రంలో బ‌స


నేడు విశాఖపట్నంలో గవర్నర్ పర్యటన


నేడు విశాఖలో సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్ ల సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ విశ్వ భూషణ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.40 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉప కులపతుల సదస్సులో పాల్గొంటారు. అనంతరం పోర్టు అతిథి గృహానికి చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి చినముషివాడలో గల శారదా పీఠానికి వెళతారు. పీఠం నుంచి 3.15 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజ్ భవన్ కు చేరుకుంటారు.