ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అమరావతి రైతుల ధర్నా - ఇవే నేటి ఏపీ అప్‌డేట్స్
మాచర్లలో నిన్న జరిగిన ఘర్షణ సందర్భంగా అమల్లోకి తీసుకొచ్చిన 144 సెక్షన్ ఇంకా కొనసాగుతోంది. దీంతోపాటు ఏపీలో ఉన్న కీలక అప్‌డేట్స్ ఇవే.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతుల ధర్నా చేపట్టనున్నారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న అమరావతి రైతులు.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రటించాలని కోరుతున్నారు. ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు ఇవాళ ధర్నా చేపట్టనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. 15వ తేదీన మద్యాహ్నం రెండు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాజధాని రైతుల ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలు దేరింది. 16వ తేదీ రాత్రికి ఢిల్లీ చేరకున్నారు. ఈ సందర్బంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా రాజధాని రైతులు కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ బుట్టో జర్దానీ చేసిన అనుచిత వ్యాక్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం పదిన్నరకు జరిగే ధర్నాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొంటారు. NTR జిల్లా కార్యలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు ధర్నాగా వెళ్ళి దిష్టిబొమ్మ దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధానకార్యదర్శి, జోనల్ ఇన్-చార్జ్ సూర్యనారాయణ రాజు పాల్గొంటారు.
దేశాన్ని అవమానించన పాకిస్థాన్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో ప్రజలు అందరూ పాల్గోనాలని ఆహ్వానిస్తున్నాము ! #AndhraPradesh #Pakistan pic.twitter.com/pv0JZhVMab
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 17, 2022
మాచర్లలో నిన్న జరిగిన ఘర్షణ సందర్భంగా అమల్లోకి తీసుకొచ్చిన 144 సెక్షన్ ఇంకా కొనసాగుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పికెటింగ్ నిర్వహిస్తున్నారు.