విశాఖ కు సీఎం జగన్


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నానికి వెళ్లనున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం 3:15 నిమిసాలకి విశాఖకు చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి దాకమర్రికి వెళతారు. అక్కడ జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని.. స్థానిక నేతలతో కాసేపు సమావేశమై అనంతరం విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుండి తాడేపల్లి బయలు దేరి వెళ్లనున్నారు.


సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరు కానున్నారు.


నేడు విశాఖలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు రెండో రోజు
విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్ లో జరగనున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు.


నేడు విశాఖ లో వైసీపీ కార్యాలయానికి శంఖుస్థాపన


విశాఖ వైసీపీ కార్యాలయానికి నేడు శంఖుస్థాపన జరగనుంది. ఎండాడ సమీపంలో ఉదయం 10:30కి  జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి తదితరులు సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.