చిరుతపులులు జనావాసాల్లోకి రావడం, దాడులు చేయడం లాంటి వార్తలు దేశవ్యాప్తంగా తరచూ ఎక్కడో ఒకచోట రిపీట్ అవుతున్నాయి. తిరుమల నడకదారిలో చిరుతపులుల దాడులు ఈ మధ్య కాలంలో రెండు జరిగాయి. ఒక చిన్నారి ప్రాణాలు కూడా కోల్పోయింది. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో ఒంటరి మహిళపై చిరుత దాడి చేసింది. వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లె సమీపంలోని ఓ క్వారీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కేకలతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పరిధిలోని ఎర్రగుంట గ్రామంకు సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో వంట మనిషిగా పని చేస్తున్న శైలజ అనే మహిళపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రానైట్ ఫ్యాక్టరీలో పని ముగించుకుని తిరిగి ఎర్రగుంట గ్రామంకు ఒంటరిగా వస్తున్న మహిళపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో మహిళ చేతులు, కాళ్ళు, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. మహిళ గెట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని కొందరు ఘటన స్ధలానికి చేరుకోవడంతో చిరుత పరార్ అయ్యింది.
మహిళను వెదురుకుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గతంలోనే ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫ్యాక్టరీ పని చేసే కొందరు ఉద్యోగులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐతే అటవీ శాఖ అధికారులు తూతూ మంత్రంగా ఘటన ప్రదేశాన్ని పరిశీలించి, చిరుత కాదని, అడవి కుక్కలని చెప్పి వెళ్ళి పోయారు. అయితే ఆదివారం మహిళపై దాడి చేసింది చిరుతేనని, చిరుత తనపై దాడి చేసినట్లు మహిళే చెబుతుందని, ఇకనైనా అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించి, గ్రామస్తులకు, ఫ్యాక్టరీ సిబ్బందకి రక్షణ కల్పించాలని స్ధానికులు కోరుతున్నారు.
అయితే చిరుత దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు గ్రామంలోకి వస్తుందేమోనని భయపడిపోతున్నారు. పొలాలకు వెళ్తున్న సమయంలో దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చిరుత పులిని త్వరగా బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చిరుతను కొట్టడంతో ప్రాణాలు దక్కించుకుంది
చిరుతపులి ఎదుట పడితే ఎవరైనా ఏం చేస్తారు. భయంతో పరుగులు తీస్తారు. ఇక చిరుత పులి దాడి చేసింది అంటే వారి పరిస్థితి ఇక అంతే ప్రాణాలు గాలిలో కలిసి పోయినట్లే. అయితే చిరుత దాడి నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కసారి చిరుత దాడి చేసింది అంటే ప్రాణాలు పోక తప్పదు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం చిరుత తనపై దాడి చేయడంతో ఎక్కడ భయపడలేదు. ఆ మహిళ చిరుత తలపడి తన ప్రాణాలను రక్షించుకుంది. తనపై దాడి చేసి చిరుత గాయపరిచినప్పటికి పట్టు విడవకుండా... ఇక సడన్ గా చిరుతపులి ఆమెపై దాడి చేయడంతో... ఆమె మొదట భయంతో ఊగిపోయింది... ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని చిరుత పైకి తిరగబడింది. మహిళా తన చేత్తో దాని ముఖం పై ప్రారంభించింది చిరుతకు చుక్కలు చూపించింది.