Tirumala News:తిరుమలపై చిచ్చు రాజేసిన పాలకమండలి సభ్యుడు నరేష్- క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలంటున్న ఉద్యోగులు

Tirumala New: తిరుమల మహాద్వారం వద్ద నెలకొన్న వివాదం బోర్డు సభ్యులు.. టీటీడీ ఉద్యోగుల మధ్య వివాదానికి కారణమైంది. బోర్డు సభ్యుడి తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

Tirumala News: తిరుమల పాలకమండలి సభ్యుడు చేసిన వివాదం నేడు పెను దుమారానికి కారణమైంది. ఎప్పుడు లేని విధంగా టీటీడీ పాలకమండలి వర్సస్ టీటీడీ ఉద్యోగుల మధ్య వివాదం రాజుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి మహాద్వారం నుంచి కేవలం ప్రత్యేక హోదాలో ఉన్న వారికే అనుమతి ఉంటుంది. నేరుగా మహాద్వారం నుంచి వెళ్లే అవకాశం.. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవో సహా కొంతమందికి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారు కాకుండా ఇతరులు ఎవరైన వైకుంఠం 1 నుంచి... సుపథం మీద లేదా బయోమెట్రిక్ నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి. ఇది టీటీడీ రూల్. 

Continues below advertisement

కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక వ్యక్తులను దర్శనం అనంతరం ఆలయం నుంచి మహాద్వారం గేటు ద్వారా బయటకు పంపుతుంటారు. ఇది రూల్ ఏమి కాదు. ప్రత్యేక వ్యక్తులు,వారికి కావాల్సిన వారు, వీఐపీలు, ఉద్యోగులు, ఇలా ఎవరిని పంపాలని రూల్ లేదు. కాని కొన్ని సంవత్సరాలుగా ఇలా పంపుతూ వచ్చారు. సాధారణ భక్తులను ఆలయం నుంచి బయటకు ఎడమ వైపు నుంచి బయటకు వస్తారు.

వివాదానికి కారణం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వీఐపీలు ప్రతి రోజు ఉంటారు. ఇలా వచ్చేవారు మహాద్వారం గేటు తీయించి గోపురం వచ్చేలా ఫొటోలకు ఫోజులివ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాధారణ భక్తుల సైతం ఇలా వచ్చి ఫొటోలు తీసుకునే వాళ్లు. అయితే భక్తుల రద్దీ విపరీతకంగా పెరిగిపోవడంతో ఆలయం ముందు నిలబడి ఫొటోలు తీసుకునేందుకు సామాన్య భక్తులకు నిరాకరించారు. వీఐపీలకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరిని అటువైపు పంపడంలేదు. 

Also Read: సైలెంట్‌గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?

ఆలయ మహాద్వారం గేటు నుంచి బయటకు వచ్చి అలవాటుగా ఆలయం ముందు ఫొటో సెషన్స్‌కు కేటాయించుకోవడంతో రద్దీ నెలకొంటుంది. ఇటీవల కాలంలో కొంత మంది వీఐపీలు ఫొటో షూట్‌లు చేయడం కూడా వివాదాలు మొదలయ్యాయి. ఆలయం ముందు ఇలాంటివి చేయడంతో మహాద్వారం గేటు నుంచి ఎవరిని అనుమతించొద్దని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయన కూడా అందరు భక్తులు వెళ్లే మార్గంలో రాకపోకలు చేస్తున్నారు. వీఐపీలు కొందరు వచ్చినప్పుడు ఆ గేటు తియ్యక తప్పడం లేదు. మీడియాను ఆలయం నుంచి దూరం పెట్టడానికి కూడా దీన్ని యూజ్ చేసుకున్నారని ఆరోపణ ఉంది.  

ఆ రోజు ఏమి జరిగింది
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ (కర్ణాటక) తన కుటుంబ సభ్యులు, బంధువులతో స్వామి దర్శనం కోసం వచ్చారు. వైకుంఠ మీదుగా ఆలయంలోకి ప్రవేశించి తిరిగి మహాద్వారం గేటు వద్దకు చేరుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీని గేటు తీయాలని సూచించారు. ఆయన సున్నితంగా ఇటు వైపు అనుమతి లేదు ఈ వైపు వెళ్లాల్సిందిగా తెలిపారు. నేను బోర్డ్ మెంబర్ గేటు తియ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగి సైతం కొంత ఆగ్రహంతో మాకు ఎవరిని పంపకండి అని చెప్పారు సార్. అటువైపు వెళ్లండి అన్నారు. దీంతో నరేష్ కుమార్ కోపంతో ఉద్యోగిపై బూతు మాటలతో విరుచుకుపడ్డాడు. ఆలయంలో ఉన్నానన్న విచక్షణ కూడా లేకుండా ఉద్యోగిపై థర్డ్ క్లాస్ నా కొ*** పోరా బయటికి అంటూ బూతు మాటలతో విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న టిటిడి విజిలెన్స్ అధికారిని పిలిచే ఉద్యోగిని బయటికి పంపే వరకు ఊరుకోలేదు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినe ఊరుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత టీటీడీ విజిలెన్స్ అధికారులు గేటు తీసి బయటకు వచ్చినా కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. ఇది మొదటిదేమీ కాదు.. మీడియా అక్కడే ఉండగా ఈ విషయం జరగడంతో వెలుగులోకి వచ్చింది తప్ప తెలియకుండా ప్రతిరోజు ఇది వివాదం వీఐపీలు... ఉద్యోగులు మధ్య జరుగుతూనే ఉంది.

టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం
విధుల్లో ఉన్న ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును టీటీడీ ఉద్యోగ సంఘాలు, వామపక్ష సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యోగి పట్ల బోర్డు సభ్యుడు ఇలా వ్యవహరించడంతో ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరేసారు ఉద్యోగులు. ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని అంటున్నారు. లేకపోతే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. వామపక్ష సంఘాలు సైతం బోర్డు సభ్యుడి తీరును తప్పుబడుతున్నాయి. ఈ వివాదంపై టీటీడీ అధికారులు, ఛైర్మన్ ఎవ్వరు మాట్లాడడం లేదు.

Also Read: శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు..తిరుమలలో ఈ టైమ్ లో ఇంత రద్దీ ఎందుకో తెలుసా సామీ!

Continues below advertisement
Sponsored Links by Taboola