Tirupati SV Zoo Park: తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో పులి పిల్ల మృతి చెందింది. గత రెండు నెలల క్రితం నల్లమల అడవిలో తల్లికి దూరమైన నాలుగు పులి పిల్లలను తిరుపతి‌ ఎస్వీ జూపార్కుకు తరలించి సంరక్షిస్తున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే నాలుగు పులి పిల్లల్లో ఓ పులి‌పిల్ల అనారోగ్యానికి గురైంది. మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆ పులి పిల్ల ఈనెల 29వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతి చేందిన పులి పిల్లకు పోస్టుమాస్టం చేయగా, కిడ్నీ, ‌లంగ్స్ సమస్య కారణంగా మృతి చేందినట్లు పోస్టుమాస్టం‌ రిపోర్టులో తేలింది. దీంతో‌ అప్రమత్తంమైన తిరుపతి ఎస్వీ జూపార్క్‌ అధికారులు మిగిలిన మూడు పులి పిల్లల రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్‍కు పంపారు.


గత రెండు నెలల క్రితం కొత్తపల్లి మండలం, గుమ్మడాపురంలో తల్లికి‌ దూరంమైన నాలుగు పులి‌ పిల్లల ఆలనా పాలన ఎస్వీ జూ పార్క్ అధికారులు చూస్తున్నారు. పసి‌ వయస్సు కలిగిన పులి పిల్లలను తిరుపతి ఎస్వీ జూ పార్క్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు‌ చేసిన క్వారంటైన్ లో ఉంచి, వైద్యుల సమక్షంలో‌ పులి పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన ఆహారం, మందులను అందిస్తూ వస్తున్నారు. అయితే మొదట్లో నాలుగు పులి ‌పిల్లలు చాలా బలహీనంగా ఉన్నా, ఆ తర్వాత ఆరోగ్యంగా తయారు అయ్యాయి. బరువు కూడా బాగానే పెరిగాయి. వీటి కోసం క్వారంటైన్ లో‌ అటవీ ప్రాంతం తలపించేలా ప్రత్యేకంగా సెట్స్ ను సైతం ఏర్పాటు చేశారు. మృతి చేందిన పులి పిల్లకు పుట్టినప్పటి‌ నుండే లంగ్స్, కిడ్నీ‌ సమస్య ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.


కునో నేషనల్ పార్కులో ఇటీవలే ఆరు చీతాలు మృతి..


మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇటీవలే ఓ చిరుత పిల్ల చనిపోయింది. ఇప్పుడు మరో రెండు చీతాలూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీన జ్వాలా చీతా నాలుగు చిరుతలకు జన్మనిచ్చింది. వీటిలో మూడు చనిపోయాయి. నాలుగో చీతాను ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ చీతా ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు. మొదటి చీతా...వీక్‌నెస్ కారణంగా చనిపోయిందని వివరించారు. ఇప్పటి వరకూ కునో నేషనల్ పార్క్‌లో ఆరు చీతాలు ప్రాణాలొదిలాయి. ఇవన్నీ ఆఫ్రికా నుంచి వచ్చినవే. ఈ ఏడాది మార్చి 27వ తేదీన నమీబియా నుంచి వచ్చిన చీతా సాశా కన్నుమూసింది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆ తరవాత ఏప్రిల్ 13వ తేదీన ఉదయ్ చీతా చనిపోయింది. మే 9వ తేదీన దక్ష అనే మరో చీతా అనారోగ్యంతో ప్రాణాలొదిలింది. దీనిపై ఆఫ్రికన్ చీతా మెటా పాప్యులేషన్‌ ఎక్స్‌పర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైల్డ్ చీతాల్లో పిల్లలు చనిపోవడం మామూలే అని వివరించారు. 


"మరో చీతా చనిపోవడం చాలా బాధాకరం. చీతాలు ఇలా చనిపోవడం అసహజం ఏమీ కాదు. వైల్ట్ చీతాల్లో మరణాల రేటు అధికంగానే ఉంటుంది. మిగతా చీతాలతో పోల్చుకుంటే...వీటికి ఎక్కువ సంఖ్యలో సంతానం కలుగుతుంది. ఎండాకాలం కావడం వల్ల డీహైడ్రేషన్ కారణంగా చీతాలు చనిపోతుంటాయి. పుట్టుకతోనే వీక్‌గా ఉన్న పిల్లలు త్వరగా ప్రాణాలు కోల్పోతాయి" - నిపుణులు