Vishnu Manchu : విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
Mohan Babu : విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో నటుడు విష్ణు మంచుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.

Police Notices To Vishnu Manchu On Student Leaders Kidnapping Case : హీరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో ఆయనకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా పీఎస్ వద్ద హాజరు కావాలని పేర్కొన్నారు.
విష్ణు రియాక్షన్...
ఈ నోటీసులపై విష్ణు మంచు రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల 15 వరకూ అందుబాటులో ఉండడని... ఆ తర్వాత వస్తానని పోలీసులకు సమాధానం ఇచ్చారు. మరోవైపు, మోహన్ బాబుకు కూడా నోటీసులు ఇద్దామని పోలీసులు అనుకుంటుండగా... ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇవ్వలేకపోతున్నారు. ఈ కేసులో మోహన్ బాబు A2గా ఉండగా... A3గా మంచు విష్ణు ఉన్నారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఫౌజీ' యాక్షన్ స్టార్ట్... బిగ్ అప్డేట్ ఇదే!
అసలేం జరిగిందంటే?
నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని... ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయాలంటే గత కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాల నేతలు పోరాటం చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ నేతలను సుమారు 30 మంది బౌన్సర్లు వచ్చి అడ్డగించారని... వారిపై దాడి చేశారంటూ సీపీఎం నేతలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందాలు వారి వాహనాలు వెంటాడి... విద్యార్థి నాయకులను విడిపించినట్లు సీపీఎం నేతలు వెల్లడించారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, విద్యార్థి సంఘ నాయకుడు వినోద్‌లను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోహన్ బాబు, విష్ణు, వారి పీఆర్వో సతీష్‌లపై కేసు నమోదైంది. ఘటనకు కారణమైన ఐదుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలు సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుకు నోటీసులు జారీ చేయగా... మోహన్ బాబుకు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
























